AP: ఏదైనా సమస్య వస్తే ఇలా చేయండి: ఎమ్మెల్యే విజయలక్ష్మి విజయనగరంలో 23,303 మంది పెన్షన్ లబ్ధిదారులకు పెన్షన్ ఇచ్చినట్లు తెలిపారు ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి. ఇక నుంచి నేరుగా ఇంటి వద్దకే వచ్చి సచివాలయ సిబ్బంది పెన్షన్ ఇస్తారన్నారు. ఏదైనా సమస్య వస్తే తనను సంప్రదించాలన్నారు. By Jyoshna Sappogula 01 Jul 2024 in ఆంధ్రప్రదేశ్ విజయనగరం New Update షేర్ చేయండి MLA Vijayalakshmi : ఎన్టీఆర్ భరోసా పింఛన్ పథకం (NTR Bharosa Pension Scheme) కార్యక్రమంలో విజయనగరం ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతిరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దేశంలోనే మొదటిసారిగా వెల్ఫేర్ ను ప్రారంభించిన మహానేత ఎన్టీఆర్ అని కొనియాడారు. నాడు పేద ప్రజలు బతకడానికి కోసం నందమూరి తారక రామారావు ఈ స్కీం తెచ్చారన్నారు. Also Read: అందుకే జీతం తీసుకోలేదు: పవన్ కళ్యాణ్ నేడు, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ఆదేశాల మేరకు ఉదయం 6 గంటలకు లబ్ధిదారులకు పెన్షన్ అందజేసినట్లు తెలిపారు. విజయనగరంలో 23,303 మంది పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారన్నారు. ఇక నుంచి నేరుగా ఇంటి వద్దకే వచ్చి సచివాలయ సిబ్బంది పెన్షన్ ఇస్తారని వెల్లడించారు. ఏదైనా సమస్య వస్తే తనను సంప్రదించాలన్నారు. #mla-vijayalakshmi మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి