Sehwag: ఇండియా పేరును భారత్‌ గా మార్చడాన్ని స్వాగతిస్తున్నాం: సెహ్వాగ్‌!

ఇండియా(INDIA) పేరును భారత్(Bharat) గా మార్చడం గురించి దేశ వ్యాప్తంగా తీవ్ర విమర్శలు ఎదురవుతుంటే..క్రికెటర్‌ (Cricketer) సెహ్వాగ్‌ (Sehwag) మాత్రం ఇండియా పేరును భారత్‌ గా మార్చడాన్ని స్వాగతిస్తున్నామంటూ పేర్కొన్నారు.

New Update
Sehwag: ఇండియా పేరును భారత్‌ గా మార్చడాన్ని స్వాగతిస్తున్నాం: సెహ్వాగ్‌!

ఇండియా(INDIA) పేరును భారత్(Bharat) గా మార్చడం గురించి దేశ వ్యాప్తంగా తీవ్ర విమర్శలు ఎదురవుతుంటే..క్రికెటర్‌ (Cricketer) సెహ్వాగ్‌ (Sehwag) మాత్రం ఇండియా పేరును భారత్‌ గా మార్చడాన్ని స్వాగతిస్తున్నామంటూ పేర్కొన్నారు. ఈ క్రమంలో టీమిండియా(Teamindia) కాదు..టీమ్‌ భారత్‌ (Team Bharat) అంటూ సెహ్వాగ్‌ చేసిన ట్వీట్ ప్రస్తుతం వైరల్‌ అవుతుంది.

వరల్డ్ కప్‌(WorldCup) 2023 కోసం ఇండియన్‌ టీమ్‌ ను సెప్టెంబర్‌ 5 న ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే జట్టును ఎంపిక చేసిన తరువాత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్‌ సోషల్‌ మీడియా వేదికగా ఆయన పోస్ట్ చేశారు. ఇండియా పేరును భారత్ గా మారుస్తారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో టీమిండియా కాదు టీమ్ భారత్‌ ఆనండి అంటూ వీరేంద్రుడు ట్వీట్‌ చేశాడు.

వరల్డ్ కప్ కోసం 15 మందితో కూడా టీమిండియాను సెలక్టర్లు ఎంపిక చేశారు. దీని గురించి సెహ్వాగ్‌ స్పందిస్తూ '' టీమిండియా కాదు..టీమ్‌ భారత్‌ . ఈ ప్రపంచ కప్‌ లో మనం కోహ్లీ, రోహిత్‌, బుమ్రా, జడేజాలాంటి వాళ్లను అభినందిస్తున్నప్పుడూ మన గుండెల్లో భారత్ ఉండాలి. అంతేకాదు ప్లేయర్స్ కూడా భారత్‌ పేరు మీద ఉన్న జెర్సీలనే వేసుకోవాలి అంటూ బీసీసీఐ సెక్రటరీ జై షా ను వీరు ట్యాగ్ చేశాడు.

అంతేకాకుండా మరో పోస్ట్ లో బ్రిటీష్‌ వాళ్లు ఇండియా పేరుని ఇచ్చారు..కానీ మనం ఎప్పుడూ కూడా భారతీయులమే అని సెహ్వాగ్‌ పేర్కొన్నారు. '' నేను ఎప్పుడూ కూడా మనం గర్వపడే పేరు ఉండాలని నేను భావిస్తుంటాను. చాలా కాలంగా ఈ పేరును మార్చి మళ్లీ మన భారత్‌ పేరును చేర్చాల్సి ఉంది. వరల్డ్ కప్‌ లో మన ప్లేయర్స్ గుండెల పై భారత్‌ పేరున్న జెర్సీలు ధరించేలా చూడాలని నేను బీసీసీఐ , జై షాను కూడా కోరుతున్నాను అని ఓ పోస్ట్‌ లో తెలిపారు.

ఇండియా పేరును భారత్ గా మార్చబోతున్నారనే అంశం తెర మీదకు రావడంతో ఇప్పుడు సెహ్వాగ్ చేసిన ఈ పోస్ట్‌ వైరల్‌ గా మారింది.

Advertisment
Advertisment
తాజా కథనాలు