Viral Video: 'మా నాన్నను జైల్లో వేయండి'.. ఓ ఐదేళ్ల బుడ్డోడి ఫిర్యాదు..! మా నాన్నని జైల్లో వేయండి.. నన్ను ఆడుకోనివ్వట్లేదంటూ ఓ ఐదేళ్ల బుడ్డోడు తన తండ్రిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మధ్యప్రదేశ్ లోని ధార్‌కు చెందిన హుస్సేన్ వచ్చీరాని మాటలతో కానిస్టేబుల్‌కు తన తండ్రిపై కంప్లెంట్ చేశాడు. అయితే, ఇందుకు వాళ్ల నాన్నతోనే వెళ్లడం విశేషం. By Jyoshna Sappogula 21 Aug 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Son Complained On His Father : చిన్నపిల్లలు ఏం చేసినా ముద్దుగానే ఉంటుంది. తల్లిదండ్రులు వారిని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటూ పెంచుతారు. ఈ క్రమంలో పిల్లలను కొన్ని సార్లు అది చేయొద్దు, ఇది చేయొద్దంటూ గట్టిగా హెచ్చరిస్తూ ఉంటారు. అయితే, పిల్లలు మాత్రం తెలిసీ తెలియని వయసు కాబట్టి కొన్నిసార్లు తల్లిదండ్రులు చెప్పిన మాట వినకుండా మారం చేస్తూ ఉంటారు. వాళ్లకు నచ్చిందే చేయాలని కొందరు మొండిగా ఏడుస్తూ ఉంటారు. ఓ ఇదేళ్ల బుడ్డోడు ఏడవడం, మారం చేయడంతో ఆగకుండా ఏకంగా తన తండ్రిపైనే పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. https://rtvlive.com/wp-content/uploads/2024/08/web-1.mp4"> Also Read: టీ20 ప్రపంచకప్ వేదిక మార్పు.. బంగ్లాదేశ్ టూ యూఏఈ! వివరాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్ (Madhya Pradesh) లోని ధార్‌కు చెందిన హుస్సేన్ అనే బాలుడు.. తన తండ్రిని జైలులో పెట్టాలని కానిస్టేబుల్ కు కంప్లైంట్ చేశాడు. ఎందుకని కానిస్టేబుల్ ప్రశ్నించగా.. 'మా నాన్న నన్ను ఆడుకోనివ్వట్లేదు, నదిలో స్నానం చేసేందుకు పంపట్లేదు, కొడుతున్నాడు' అంటూ వచ్చీరాని మాటలతో గుక్క పెట్టి ఏడుస్తూ తన బాధను చెప్పుకున్నాడు. తండ్రి ఇక్బాల్ ను వెంటనే జైలులో పెట్టాలని కానిస్టేబుల్ తో చెప్పాడు. అయితే, కంప్లైంట్ చేసేందుకు వెళ్లింది ఎవరితో తెలుసా.. వాళ్ల డాడీతోనే! ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా (Social Media) లో వైరల్ అవుతోంది. #viral-video మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి