BREAKING: బీజేపీకి విజయశాంతి రాజీనామా! తెలంగాణ ఎన్నికల వేళ బీజేపీకి షాక్ తగిలింది. బీజేపీకి విజయశాంతి రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డికి పంపించినట్లు సమాచారం. By V.J Reddy 15 Nov 2023 in రాజకీయాలు Uncategorized New Update షేర్ చేయండి Telangana Elections 2023: తెలంగాణ ఎన్నికల వేళ బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ మార్పుపై జరుగుతున్న ప్రచారానికి విజయశాంతి చెక్ పెట్టారు. బీజేపీకి విజయశాంతి రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డికి పంపారు. గత కొన్ని రోజులుగా బీజేపీలో అసంతృప్తిగా ఉన్న ఆమె ఎల్లుండి రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు సమాచారం. ALSO READ: ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తాం.. కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు! విజయశాంతి తన ట్విట్టర్(X) ఖాతాలో.. "తెలంగాణల సెటిలర్స్ అన్న భావన లేదు. ఈ రాష్ట్రంలో ఉన్న బిడ్డలు ఎవరైనా తెలంగాణ ప్రజలే, ఆ ప్రజల ప్రయోజనాలు, భధ్రత, తెలంగాణాల కాపాడబడి తీరాలన్న విధానం కచ్చితంగా సమర్ధించబడవలిసినదే. కానీ తరతరాలు పోరాడిన మా తెలంగాణ ఉద్యమకారులు ప్రాంతేతర పార్టీలను ఎన్నికల పరంగా ఆమోదించరు. అది, ఎప్పటికీ నిరూపితమైన వాస్తవం. అదే సమయంలో మరో అంశాన్ని తప్పక దృష్టిలో ఉంచుకోవాలి. ప్రాంతేతర పార్టీలను, అక్కడి ప్రాంతం నుండి వచ్చి.. ఇక్కడ ఉంటున్న తెలుగు బిడ్డలను ఒకే గాటన కట్టడం ఎంతమాత్రం సరికాదు. ఈ అంశం తెలంగాణల తెలుగుదేశం పార్టీకి కూడా అవగతమైన దృష్ట్యా ఎన్నికలకు ఇక్కడ దూరమైనట్లు తెలుస్తున్నది. అట్లే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బీఆర్ఎస్ కూడా దూరం ఉన్నట్లు తెలుస్తున్నది వాస్తవం, పార్టీల ప్రయోజనాలు వేరు... ప్రజా ప్రయోజనాలు వేరు. ఏ ప్రాంతం వారైనప్పటికీ, భారత జాతిగా.. వివిధ ప్రాంతాల ప్రజల మధ్య సంబంధాలు నిలబడేలా చేస్తూ ప్రజాస్వామిక వ్యవస్థలను కాపాడటం సమాఖ్య వ్యవస్థలో మనందరి విధి. అందుకే, కోవిడ్ కష్టకాలంలో, ప్రాణాపాయంలో ఉండి అంబులెన్స్‌లల్ల వస్తున్న ఆంధ్ర ప్రాంత వైద్య అవసర బాధితులు హైదరాబాద్ హాస్పిటల్స్‌కు రాకుండా, సరిహద్దు చెక్ పోస్టుల వద్ద తెలియక పోలీసులు అడ్డుకున్న నాడు, వారిని తక్షణం వదలకుంటే, ఎంతటి కొట్లాటకైనా సిద్ధపడతానని చెప్పినది రాములమ్మేనన్న జ్ఞాపకం ఇప్పటికీ అందరికీ సజీవమే... జై శ్రీరామ్ హర హర మహాదేవ జై తెలంగాణ విజయశాంతి" అని రాసుకొచ్చారు. #telangana-elections-2023 #vijayshanthi-resigned-to-bjp మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి