ప్రజలను వణికిస్తున్న విచిత్రమైన జ్వరం.. ఆసుపత్రికి క్యూ

బీహార్‌లోని పాట్నాలో 'లేమ్ ఫీవర్' అనే జ్వరం ప్రజలలో ఆందోళన కలిగిస్తోంది. ఇతర వైరల్ జ్వరాల మాదిరిగానే దోమల వల్లే ఇది కూడా వస్తుందని వైద్యులు భావిస్తున్నారు. ఈ జ్వరం లక్షణాలు డెంగ్యూ మాదిరిగానే ఉంటాయి. ఈ పరిస్థితిలో రోగి నడవడానికి చాలా ఇబ్బందిని ఎదుర్కొంటాడు.

New Update
fever1

fever

Lame fever:  బీహార్‌లోని పాట్నాలో ఓ కొత్త రకం జ్వరం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది.  "లేమ్ ఫీవర్" లేదా "లాంగ్డా బుఖారీ" అని పిలువబడే ఈ ప్రమాదకరమైన వైరల్ ఫీవర్ వేగంగా విస్తరిస్తోంది. ఈ జ్వరం మోకాళ్లు, నడుముపై ఎక్కువగా ప్రభావం చూపుతున్నట్లు తెలుస్తోంది. దీని లక్షణాలు డెంగ్యూ మాదిరిగానే ఉంటాయి. ఈ పరిస్థితిలో రోగి నడవడానికి చాలా ఇబ్బందిని ఎదుర్కొంటాడు. ఈ జ్వరం కారణాలుపై చాలా అస్పష్టత ఉన్నప్పటికీ.. లక్షణాలను గుర్తించి నివారణ చర్యలు తీసుకోవడం ద్వారా వ్యాధి ప్రమాదాన్ని తగ్గించవచ్చు.  

 "లేమ్ ఫీవర్" అంటే ఏమిటి? 

ఈ జ్వరాన్ని కుంటి జ్వరం కూడా అంటారు. పాట్నాలోని లోహానిపూర్, కడమ్‌కువాన్, భూత్‌నాథ్ రోడ్ తో పాటు మరికొన్ని చోట్ల కుంటి జ్వరం కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. ఈ  లక్షణాలు డెంగ్యూ మాదిరిగానే ఉన్నాయి. కానీ డెంగ్యూ లేదా చికున్‌గున్యా వంటి జ్వరాలకు భిన్నంగా, దీని పరీక్షల ఫలితాలు ప్రతికూలంగా ఉన్నాయి. ఇతర వైరల్ జ్వరాల మాదిరిగానే దోమల ఇది కూడా వస్తుందని వైద్యులు భావిస్తున్నారు.  అసలు ఈ జ్వరానికి నిజమైన కారణమేంటి అనేది  వైద్య నిపుణులను గందరగోళానికి గురి చేస్తుంది.

కుంటి జ్వరం లక్షణాలు 

  • విపరీతమైన జ్వరం: సాధారణ జ్వరం  శరీర ఉష్ణోగ్రత కంటే ఎక్కువగా ఉంటుంది.  
  • తీవ్రమైన కాలు నొప్పులు.. ఇది నడవడంలో చాలా ఇబ్బందిని కలిగిస్తాయి. అంతేకాదు విపరీతమైన మోకాళ్ళ నొప్పులు, వాపును అనుభవిస్తారు. 
  • నడవడానికి ఇబ్బంది పడుతూ కుంటుతారు.. లేదా ఇతరుల సహాయం తీసుకుంటారు.
  • ఈ జ్వరం తగ్గిన తర్వాత కూడా 10-15 రోజుల వరకు సరిగ్గా నడవలేకపోతున్నారని రోగులు నివేదించారు,

 

 

నివారణ చర్యలు 

  • శరీరానికి కావాల్సినంత నీరు తీసుకోవాలి. దీని వల్ల శరీరంలోని కాలుష్య కారకాలు వ్యర్థాల రూపంలో బయటకు వెళ్లిపోతాయి. తద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. 
  • దోమలు వృద్ధి చెందే ప్రాంతాలలో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. 
  • దోమలు కుట్టకుండా నిద్రించే సమయంలో దోమతెరలను ఉపయోగించాలి. 
  • జ్వరం లేదా కాళ్లలో తీవ్రమైన అసౌకర్యం ఉన్నవారు, వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిది. 

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

Also Read: ఆఫీస్ లో నిలబడి పని చేసేవాళ్లకు షాక్.. ప్రాణాలకే ప్రమాదం! పరిశోధనలో షాకింగ్ విషయాలు

Advertisment
Advertisment
తాజా కథనాలు