కారులో ఎక్కువగా ప్రయాణించేవారికి క్యాన్సర్!.. పరిశోధనలో షాకింగ్ విషయాలు కారులో గంటల తరబడి ప్రయాణం చేయడం ప్రాణాలకు ముప్పు అని చెబుతున్నారు నిపుణులు. కారు క్యాబిన్స్ క్యాన్సర్ విషపూరితలను నిండి ఉంటాయని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.. By Archana 21 Oct 2024 in lifestyle Latest News In Telugu New Update షేర్ చేయండి 1/8 టెక్నాలజీ అభివృద్ధి చెందే కొద్దీ మనుషులు కూడా విలాసవంతమైన జీవితానికి బాగా అలవాటు పడిపోతున్నారు. ఒకప్పుడు ఎక్కడికైనా వెళ్లాలంటే బస్సులు లేదా ట్రైన్లలో ప్రయాణం చేసేవారు. కానీ ఇప్పుడు ప్రతీ ఒక్కరూ కార్లలోనే ప్రయాణించేందుకు ఇష్టపడుతున్నారు. టూర్లకు, పార్టీలకు, పింక్నీక్ లకు వెళ్లాలంటే తప్పకుండా కార్లనే వినియోగిస్తున్నారు. కారులో అయితే విలాసవంతంగా, సౌకర్యంగా ఉంటుందని భావిస్తున్నారు. 2/8 అయితే కారులో ఎక్కువగా ప్రయాణించడం ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. కారు క్యాబిన్లలో క్యాన్సర్ కు కారణమయ్యే విషపూరితమైన కెమికల్స్ ఉంటాయని తాజాగా అధ్యయనాలు చెబుతున్నాయి. 3/8 అమెరికాలో ఇటీవల నిర్వహించిన పీర్ రివ్యూడ్ రిసెర్చ్ లో షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయి. కారు క్యాబిన్లలోని గాలిలో క్యాన్సర్ కు కారణమయ్యే కెమికల్స్ ఉత్పత్తి అవుతాయని రీసర్చ్ తెలిపింది. ఈ గాలిని పీల్చడం ద్వారా అనారోగ్యం బారిన పడే ప్రమాదం ఉన్నట్లు అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. 4/8 2015 నుంచి 2022 వరకు మార్కెట్లో అందుబాటులో ఉన్న కార్ల పై ఈ అధ్యయనం నిర్వహించారు. అమెరికాలో సుమారు 30 రాష్ట్రాల్లో పరిశోధన నిర్వహించగా ఈ విషయం వెల్లడైంది. 5/8 అయితే కారు అగ్ని ప్రమాదానికి గురైనప్పుడు క్యాబిన్స్ లో మంటలు రాకుండా ఉండడానికి ఫ్లేమ్ రిటార్డెంట్ అనే కెమికల్స్ ఉపయోగిస్తారు. ఈ కెమికల్స్ మంటలు రాకుండా రక్షిస్తాయి. అయితే ఈ కెమికల్స్ లో క్యాన్సర్ కు కారణమయ్యే వాయువులు ఉన్నట్లు పరిశోధకులు చెబుతున్నారు. అమెరికాలో నడిచే 99% కార్లలో TCIPPఫ్లేమ్ రిటార్డెంట్ రసాయనాలను ఉపయోగిస్తున్నారు. ఇవి క్యాన్సర్ కు కారణం అవుతాయట. 6/8 అందుకే కార్లలో వీలైనంత తక్కువగా ప్రయాణం చేయడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ కెమికల్స్ ప్రభావం పిల్లల పై ఎక్కువగా ఉంటుందట. శ్వాస సంబంధ సమస్యలు , తక్కువ పెరుగుదల, నరాల బలహీనత, ఊబకాయం, ఉబ్బసం వంటి ఇబ్బందులు తలెత్తుతాయని అంటున్నారు. అంతేకాదు ఫ్లేమ్ రిటార్డెంట్ల కారణంగా పిల్లల్లో IQ శక్తి క్రమంగా తగ్గుతున్నట్లు పరిశోధకులు తెలిపారు. 7/8 ఫ్లేమ్ రిటార్డెంట్ల నుంచి ఎలా కాపాడుకోవాలి? కారు క్యాబిన్స్ లో విడుదలయ్యే రసాయనాలు ప్రభావాన్ని కొన్ని చిట్కాల ద్వారా తగ్గించవచ్చు. కార్ పార్కింగ్ చేసినప్పుడు విండోలు ఓపెన్ చేసి ఉంచాలి. అలాగే ప్రయాణానికి కొద్ది సేపటి ముందు విండోలను ఓపెన్ చేసి పెట్టాలి. 8/8 గమనిక: ఈ కథనం ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి