ఇదేం సినిమా థియేటర్ కాదు..... ఎంపీపై రాజ్యసభ చైర్మన్ ఫైర్....!

రాజ్యసభ సమావేశాలు మరోసారి వాయిదా పడ్డాయి. సభ ప్రారంభం కాగానే మణిపూర అంశంపై చర్చకు విపక్ష సభ్యులు పట్టుబట్టారు. మణిపూర్ అంశంపై ప్రధాని మోడీ సమాధానం ఇవ్వాలంటూ టేబుల్స్ ను కొడుతూ విపక్ష సభ్యులు నినాదాలు చేశారు. దీంతో టీఎంసీ ఎంపీ ఓబ్రెయిన్ పై రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ ఖడ్ ఫైర్ అయ్యారు. ఇది సినిమా హాల్ కాదని మందలించారు.

author-image
By G Ramu
New Update
ఇదేం సినిమా థియేటర్ కాదు..... ఎంపీపై రాజ్యసభ చైర్మన్ ఫైర్....!

మణిపూర్ హింసాకాండపై పార్లమెంట్‌లో రచ్చ జరుగుతోంది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం అయిన రోజు నుంచి ఉభయ సభలు వరుసగా వాయిదా పడుతూ వస్తున్నాయి. తాజాగా ఈ రోజు కూడా మణిపూర్ అంశంపై సభలో విపక్షాలు ఆందోళనకు దిగాయి. ఈ క్రమంలో టీఎంసీ ఎంపీ ఓబ్రెయిన్ కు రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ ఖడ్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.

మణిపూర్ అంశంపై రాజ్యసభలో చర్చ జరపాలని ఓబ్రెయిన్ పట్టుబట్టారు. మణిపూర్ అంశంపై చర్చకు 267 నిబంధన కింద విపక్ష సభ్యులు నోటీసులు ఇచ్చారని పేర్కొన్నారు. చర్చకు పట్టుబడుతూ టేబుల్స్ పై చేతితో గట్టి కొడుతూ డిమాండ్ చేశారు. సభలో సభ్యులు శాంతించాలని చైర్మన్ జగదీప్ ధన్ ఖడ్ కోరుతున్నా ఎంపీలు వెనక్కి తగ్గలేదు.

ఎంపీల తీరుపై జగదీప్ ధన్ ఖడ్ తీవ్రంగా ఫైర్ అయ్యారు. ఇది నాటక శాలలాగా మారిందన్నారు. ప్రతి సారి తాను చర్చను ప్రారంభిస్తానని చెప్పడం, ప్రతిపక్ష సభ్యులు నినాదాలు చేయడం అలవాటుగా మారిందన్నారు. అలా బల్ల మీద చేతులతో కొట్టడం ఏంటని ప్రశ్నించారు. ఇదేమీ సినిమా థియేటర్ కాదని చైర్మన్ ఫైర్ అయ్యారు. సభలో రోజూ ఇదే విధమైన పరిస్థితులు కొనసాగితే ప్రజల్లో మనకు ఎలాంటి గౌరవం ఉంటుందని ఆయన ప్రశ్నించారు.

అనంతరం సభను వాయిదా వేశారు. అంతకు ముందు మణిపూర్ అంశంపై ప్రధాని మోడీ సభలో ప్రకటన చేయాలని లోక్ సభలో విపక్షాలు డిమాండ్ చేశాయి. సభలో రభస చోటు చేసుకోవడంతో సభ మధ్యాహ్నం 12 గంటలవరకు వాయిదా పడింది. ఉభయ సభల్లో లిస్ట్ కు నిర్దేశించిన అన్ని అంశాలనూ పక్కన బెట్టి మొదట మణిపూర్ అంశంపై చర్చ చేబట్టాలని ప్రతిపక్ష సభ్యులు నినాదాలు చేశారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు