పాలిటిక్స్ లోకి వంగవీటి ఆశాలత.... ఆ నియోజక వర్గం నుంచి బరిలోకి...!

వంగవీటి రాధ కూతురు ఆశాలత రాజకీయ అరంగేట్రం చేసేందుకు రెడీ అవుతున్నారు. ఆమె వైసీపీ నుంచి బరిలోకి దిగనున్నారు. ఇప్పటికే ఆ మేరకు ఆశాలతో వైసీపీ సంప్రదింపులు జరిపినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఆమెను ఏ నియోజక వర్గం నుంచి బరిలోకి దించాలని అధికార వైసీపీ వ్యూహాలు రచిస్తున్నట్టు తెలుస్తోంది.

New Update
పాలిటిక్స్ లోకి వంగవీటి ఆశాలత.... ఆ నియోజక వర్గం నుంచి బరిలోకి...!

వంగవీటి రంగా.. తెలుగు రాష్ట్రాల పాలిటిక్స్ లో పరిచయం అక్కరలేని పేరు. ఎంతో మంది నిరుపేదలకు అండగా నిలిచి జననేతగా పేరు సంపాదించుకున్నారు. ఎమ్మెల్యేగా పని చేసింది కొద్ది కాలమే అయినా రాష్ట్ర రాజకీయాలను షేక్ చేశారు. ఇప్పటికీ బెజవాడ పాలిటిక్స్ లో ఆయన పేరు ఓ బ్రాండ్. అందుకే అన్ని పార్టీలు ఆ బ్రాండ్ ను వాడుకునేందుకు పోటీ పడుతుంటాయి. మరణించి 35 ఏండ్లు అయినా ఆయన పేరు చెబితే ప్రజల్లో ఇప్పటికీ ఓ వైబ్రేషన్ వస్తుంది.

vangaveeti ranga daughter political entry from that constituency vangaveeti ranga daughter political entry from that constituency Vangaveeti ranga daughter political entry from that constituency

తాజాగా ఆయన కూతురు ఆశాలత ఏపీ పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. తండ్రి లాగా .పాలిటిక్స్ లో ప్రజల్నిమెప్పించాలని అనుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ మేరకు ఆమె పావులు కదుపుతున్నట్టు సమాచారం. దీంతో పాలిటిక్స్ లో ఆమె తండ్రికి తగ్గ తనయగా పేరు తెచ్చుకుంటుందా.. బెజవాడ రాజకీయాల్లో తనదైన ముద్ర వేస్తుందా అని పొలిటికల్ సర్కిల్ లో హాట్ హాట్ చర్చ నడుస్తోంది.

2024 అసెంబ్లీ ఎన్నికల బరిలో ఆమెను దించాలని పలు పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ మేరకు పార్టీలు ఆమెతో చర్చలు జరుపుతున్నాయి. ఈ విషయంలో వైసీపీ కాస్త ముందు వున్నట్టు తెలుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లోనే ఆమెను పాలిటిక్స్ లోకి తీసుకు రావాలని వైసీపీ ప్రయత్నించింది. కానీ వీలు పడలేదు. కానీ ఈ సారి ఎన్నికల్లో ఆమెను పోటీ చేయించాలని గట్టిగా ప్రయత్నం చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

ఆశాలత పాలిటికల్ ఎంట్రీ విషయంలో ఆమె తల్లి రత్న కుమారి నిర్ణయం కీలకంగా వుంటుందని తెలుస్తోంది. గతంలో తండ్రి పోటీ చేసిన నియోజక వర్గం నుంచే ఆమె తన అదృష్టాన్ని పరీక్షించుకుంటారని వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి. విజయవాడ సెంట్రల్ లేదా తూర్పు నుంచి ఆమె పోటీ చేస్తారని టాక్ నడుస్తోంది. ఆమె సోదరుడు వంగవీటి రాధా టీడీపీలో కొనసాగుతున్నారు. దీంతో ఆయన ఏ నియోజవర్గం నుంచి పోటీ చేస్తారనే విషయం ఆధారంగా ఆశా లతను ఎక్కడి నుంచి పోటీ చేయించాలనే విషయంపై నిర్ణయం తీసుకోవాలన్న యోచనలో వైసీపీ ఉన్నట్టు తెలుస్తోంది.

ఒక వేళ విజయవాడ తూర్పు నుంచి వంగ వీటి రాధ పోటీ చేస్తే. ఆశా లతను సెంట్రల్ నుంచి పోటీ చేయించాలని, ఒక వేళ రాధ అవని గడ్డ నుంచి పోటీ చేస్తే ఆశాను విజవాడ తూర్పు నుంచి బరిలోకి దించాలని వైసీపీ వ్యూహాలు రెడీ చేస్తున్నట్టు రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇక ఆశా లతకు పాలిటిక్స్ పై ఇంట్రెస్ట్ వున్నట్టు ఆమె సన్నిహితుల ద్వారా తెలుస్తోంది. దీంతో ఆమె పొలిటికల్ ఎంట్రీ ఖాయమని అంటున్నారు. అయితే ఈ విషయంలో ఆమె తల్లి రత్న కుమారి నిర్ణయం కీలంగా వుంటుందని చర్చ నడుస్తోంది.

వంగ వీటి రంగా హత్య అనంతరం రత్నమాల రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. ఓ సారి ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ రాజకీయాల్లో నిలదొక్కుకోలేకపోయారు. ఆ తర్వాత రంగా వారసునిగా వంగవీటి రాధా కృష్ణ రాజకీయాల్లో ప్రవేశించారు. 2004లో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ తర్వాత 2009లో పీఆర్పీ నుంచి పోటీ చేసి ఓడి పోయారు. అనంతరం 2014లో వైసీపీ నుంచి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన వైసీపీని వీడి టీడీపీలో చేరారు. ప్రస్తుతం టీడీపీలో రాధ కొనసాగుతున్నారు. ఈ క్రమంలో పాలిటిక్స్ లో ఆశాలత ఎంత మేరకు విజయం సాధిస్తుందనే విషయంపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది.

#NULL
Advertisment
Advertisment
తాజా కథనాలు