Home Minister Anita: హోంమంత్రిగా వంగలపూడి అనిత బాధ్యతలు AP: హోంమంత్రిగా వంగలపూడి అనిత బాధ్యతలు స్వీకరించారు. సచివాలయంల బ్లాక్ 2లో హోమంత్రి అనిత బాధ్యతలు చేపట్టారు. ఆమెకు వేదపండితులు ఆశీర్వచనం చేశారు. కాగా రేపు ప్రొటెం స్పీకర్గా బుచ్చయ్య చౌదరి ప్రమాణస్వీకారం చేయనున్నారు. By V.J Reddy 19 Jun 2024 in ఆంధ్రప్రదేశ్ Latest News In Telugu New Update షేర్ చేయండి Home Minister Anita: ఏపీ హోంమంత్రిగా వంగలపూడి అనిత బాధ్యతలు స్వీకరించారు. సచివాలయంల బ్లాక్ 2లో హోమంత్రి అనిత బాధ్యతలు చేపట్టారు. ఆమెకు వేదపండితులు ఆశీర్వచనం చేశారు. కాగా రేపు ప్రొటెం స్పీకర్గా బుచ్చయ్య చౌదరి ప్రమాణస్వీకారం చేయనున్నారు. మంత్రి అనిత కామెంట్స్.. రాష్ట్ర ప్రజలు దయ వల్ల,చంద్రబాబు ఆశీస్సులతో హోం మంత్రిగా బాధ్యతలు చేపట్టాను.. సామాన్య టీచర్ ను హోం మంత్రిగా చేసిన పాయకరావు పేట అందరికీ ధన్యవాదాలు. నా మీద పెట్టిన గురుతర బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తాను. గత ఐదేళ్లలో లా అండ ఆర్థర్ లో అనేక ఇబ్బందులు ఎదురయ్యాయి. రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండేలా శాంతిభద్రతల నిర్వహణ ఉంటుంది. దిశా పోలీస్ స్టేషన్ల పేరు మారుస్తాం. పోలీస్ డిపార్ట్మెంట్ లో కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి పోలీసుల్లో పాత బ్లడ్ ఉంటే పక్కకు తప్పుకోవాలి పోలీసులు ప్రజలకు అనుకూలంగా పని చేయాలి ఖాకీ డ్రెస్ కు గౌరవంగా పనిచేయాలి సోషల్ మీడియా లో మనోభావాలు దెబ్బ తీసేలా వ్యవహరిస్తే కఠిన చర్యలు 100 రోజుల్లో గంజాయి,డ్రగ్స్ రవాణా చాల వరకూ తగ్గిస్తాం. గత ప్రభుత్వంలో అక్రమ కేసులపై విచారణ జరిపిస్తాము. అక్రమాలకు బలైన వారు కేసు రీఓపెన్ చేయాలని కోరితే తప్పకుండా చేస్తాం. #vangalapudi-anitha సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి