UTS App : ట్రైన్‌ టికెట్ బుక్ చేస్తున్నారా..? అయితే.. ఈ యూటీఎస్‌ యాప్‌ గురించి తెలుసుకోండి!

ట్రైన్ టికెట్ బుక్ చేయాలంటే మనందరికీ మొదట గుర్తొచ్చేది ఐఆర్‌సీటీసీ (IRCTC). లేదా రైల్వే రిజర్వేషన్ కౌంటర్‌కు వెళ్లి టికెట్ బుక్ చేసుకుంటారు. ఇదే కాకుండా మరో యాప్ ద్వారా ట్రెయిన్ టికెట్ బుక్ చేసుకోవచ్చు. ఆ యాప్ ఏంటో తెలుసుకోండి!

New Update
UTS App : ట్రైన్‌ టికెట్ బుక్ చేస్తున్నారా..? అయితే.. ఈ యూటీఎస్‌ యాప్‌ గురించి తెలుసుకోండి!

మనలో చాలా మంది రైల్‌ ప్రయాణం చేస్తుంటాం. అప్పటికప్పుడు జర్నీ కోసమైతే కౌంటర్‌ వద్దే టికెట్‌ తీసుకుంటాం. ఒక్కోసారి కౌంటర్‌ వద్ద రద్దీ వల్ల టికెట్ తీసుకోవడంలో ఇబ్బందులు పడుతుంటాం. ఈ ఇబ్బందులకు చెక్‌ పెట్టేందుకే రైల్వే శాఖ అన్‌రిజర్వ్‌డ్‌ టికెట్‌ బుకింగ్‌ సిస్టమ్‌ (UTS) యాప్‌ను ప్రారంభించింది. ఈ యాప్‌ ద్వారా టికెట్‌ బుకింగ్‌ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం..

UTS App ద్వారా ఇలా టికెట్‌ బుకింగ్ చేసుకోండి:

  • మొదట UTS యాప్‌ను గూగుల్‌ ప్లేస్టోర్‌/ యాప్‌ స్టోర్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకుని అకౌంట్‌ క్రియేట్‌ చేసుకోవాలి.
  • యాప్‌లో లాగిన్‌ అయిన వెంటనే స్క్రీన్‌పై కనిపించే Normal Booking సెక్షన్‌లోకి వెళ్లాలి.
  • అందులో కనిపించే Book and Travel (పేపర్‌లెస్), Book and Print (పేపర్‌).. ఈ రెండు ఆప్షన్లలో ఏదో ఒక ఆప్షన్‌ ఎంచుకోవాలి.
  • పేపర్‌ లెస్‌ ఆప్షన్‌ ఎంచుకుంటే మొబైల్‌లో జీపీఎస్‌ను ఆన్‌ చేయాలి.
  • తర్వాత మీరు ఎక్కడినుంచి ప్రయాణించాలనుకుంటున్నారో ఆ స్టేషన్‌తో పాటు ఎక్కడికి వెళ్లాలనుకుంటున్నారో ఆ స్టేషన్‌ను ఎంచుకోవాలి.
  • కింద కనిపించే ఆప్షన్ల ద్వారా మీ ప్రయాణానికి అందుబాటులో ఉన్న ట్రైన్‌లు, వాటి ఛార్జీలు డిస్‌ప్లే అవుతాయి.
  • Get Fareపై క్లిక్‌ చేసి మీకు నచ్చిన ట్రైన్‌పై క్లిక్‌ చేయగానే టైం, ప్లాట్‌ఫాం నంబర్‌, ట్రైన్‌ నంబర్‌, టికెట్‌ ధర వంటి వివరాలు కనిపిస్తాయి.
  • ప్యాసింజర్ల సంఖ్య, ట్రైన్‌ టైప్‌ (ప్యాసింజర్‌, ఎక్స్‌ప్రెస్‌, సూపర్‌ ఫాస్ట్‌), పేమెంట్‌ టైప్‌ను ఎంచుకోవాలి.
  • కిందకు స్క్రోల్‌ చేయగానే కనిపించే BOOK TICKET ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి.
  • ఆర్‌- వాలెట్‌, డెబిట్‌ కార్డ్‌/ UPI / ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌/ క్రెడిట్‌ కార్డ్‌.. ఈ చెల్లింపు ఎంపికల్లో ఏదో ఒక దాన్ని ఎంచుకొని టికెట్‌ బుక్‌ చేసుకోవాలి.
  • గమనిక :

    • మీరు టికెట్‌ బుక్‌ చేసే ముందు పేపర్‌ మోడ్‌ ఎంచుకుంటే దగ్గరల్లోని UTS కియోస్క్ లేదా రైల్వే బుకింగ్ కౌంటర్‌కు వెళ్లి ప్రింట్‌ తీసుకోవాలి. ATVMలో ప్రయాణికులు పేపర్‌లెస్ టిక్కెట్‌లను ప్రింట్ చేయలేరు.
    • ఆర్‌- వాలెట్‌ను టాప్‌- అప్‌ చేయడం తప్పనిసరి కాదు. ఒకవేళ చేస్తే వాలెట్‌ టాప్‌-అప్‌పై 3 శాతం బోనస్‌ లభిస్తుంది.
    • ఈ యాప్‌ ద్వారా ఒకప్పుడు స్టేషన్‌కు 5 కి.మీ. పరిధిలో మాత్రమే టికెట్‌ బుక్‌ చేసుకునే వీలుండేది. దాన్ని పట్టణ ప్రాంతాల్లో 10 కి.మీ., ఇతర ప్రాంతాల్లో 20 కి.మీ.కు పెంచారు. మీరు స్టేషన్ ఆవరణలో లేదా ట్రైన్‌ ఎక్కాక యూటీఎస్‌ టిక్కెట్‌ను బుక్ చేయడం కుదరదు.
    • ప్లాట్‌ఫారం టిక్కెట్‌లను బుక్ చేసుకోవడానికి మీరు స్టేషన్‌కు 2 కిలోమీటర్ల పరిధిలో లేదా రైల్వే ట్రాక్‌కు 15 మీటర్ల దూరంలో ఉండాలి.
    • ప్రయాణీకులు 3 నెలలు, 6 నెలలు లేదా సంవత్సరానికి సీజనల్ టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు.
    • UTS టికెట్ బుకింగ్ సేవ 17 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న వ్యక్తికి అందుబాటులో లేదని విషయాన్ని గుర్తుంచుకోండి.
Advertisment
Advertisment
తాజా కథనాలు