Kosi bridge: కుప్పకూలిన దేశంలోని అతి పెద్ద వంతెన.. కోసి నదిపై నిర్మాణంలో ఉన్న దేశంలోనే అతిపెద్ద వంతెనలో కొంత భాగం కూలిపోయింది, ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, 20 మందికి తీవ్రగాయాలైయాయి. By Durga Rao 22 Mar 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి దేశంలోనే అతి పొడవైన బీహార్ లోని కోసి నది పై నిర్మిస్తున్న మహాసేతు వంతెన పనులు శరవేగంగా జరుగుతున్నాయి.(10.2 కి.మీ.) కేంద్ర రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ నుంచి రూ.1199 కోట్ల 58 లక్షల వ్యయంతో ఈ మహాసేతును అప్రోచ్‌లతో నిర్మిస్తున్నారు. సుపాల్ జిల్లాలోని బకౌర్ మధుబని జిల్లాలోని భేజా మధ్య వంతెన 50, 51,52 స్తంభాల గార్టర్‌లు ప్రమాదవశాత్తు నేలపై పడ్డాయి. ఈ ఘటనలో 1 వ్యక్తి మరణించగా పలువురికి గాయాలైనట్టు స్థానిక ఉన్నతాధికారి వెల్లడించారు. ప్రమాదంలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని, వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. ప్రస్తుతం, బాకూర్ , భాజ్ మధ్య వంతెన గార్టర్ కూలిపోవడంతో ఇంకా సహాయక చర్యలు ప్రారంభించలేదు. దాదాపు 20 మందికి పైగా శిథిలాల కింద చిక్కుకుపోయి ఉంటారని స్థానికులు చెబుతున్నారు. ప్రస్తుతం 20 మందిని గ్రామస్తుల సాయంతో ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన చాలా సమయం కూడా సహాయ చర్యలు ప్రారంభం కాలేదని స్థానికులు వాపోతున్నారు. భారత్ మాల ప్రాజెక్టు కింద నిర్మిస్తున్న ఈ వంతెన కేంద్ర ప్రభుత్వ పెద్ద పథకాల్లో ఒకటి. రూ.1200 కోట్లతో కేంద్ర రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ నిర్మిస్తోన్న దేశంలోనే అత్యంత పొడవైన వంతెనను కూడా ఇది.దీని పొడవు 10.2 కిమీ కంటే ఎక్కువ. అప్రోచ్ రోడ్డుతో కలిపి వంతెన మొత్తం పొడవు 13.3 కిలోమీటర్లు కాగా 2023 నాటికి . వంతెన నిర్మాణం పూర్తి కావాల్సి ఉంది. కాని కరోనా వరదల కారణంగా వంతెన నిర్మాణ పనులు ఆలస్యమైయాయి. #collapsed #kosi-bridge మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి