TS News: బావి తవ్వుతుండగా ప్రమాదం..మట్టిలో కూరుకుపోయిన ఇద్దరు వ్యక్తులు..! వ్యవసాయ బావి తవ్వుతుండగా ఇద్దరు వ్యక్తులో మట్టిలో చిక్కుకుపోయారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు రెండు గంటల శ్రమించి వారిని సురక్షితంగా బయటకు తీశారు. ఇద్దరికి స్వల్పగాయాలు అయ్యాయి. దీంతో కుటుంబ సభ్యులు, పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు. By Bhoomi 03 Apr 2024 in క్రైం తెలంగాణ New Update షేర్ చేయండి TS News: వ్యవసాయ బావి తవ్వుతుండగా ఇద్దరు వ్యక్తులో మట్టిలో చిక్కుకుపోయారు. నరకయాతన అనుభవించి మృత్యువు అంచుకు వరకు వెళ్లిన ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు రెండు గంటల శ్రమించి వారిని సురక్షితంగా బయటకు తీశారు. ఇద్దరికి స్వల్పగాయాలు అయ్యాయి. దీంతో కుటుంబ సభ్యులు, పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు. అసలేం జరిగిందంటే: కేసముద్రం మండల పరిధిలోని గాంధీనగర్ గ్రామానికి చెందిన సుధాకర్ అనే రైతు తాను సాగు చేసే పొలంలో బావి తవ్వకం ప్రారంభించాడు. బావి తవ్వుతుండగా అడుగున ఓ రాయి తగిలింది. దానిని పరిశీలించేందుకు కూలీ నరేశ్ తోపాటు సుధాకర్ బావిలోకి దిగారు. అయితే ప్రమాదవశాత్తు బావిలో దిగినివారిపై మట్టికూలింది. దీంతో పీకల్లోతు వరకు మట్టిలో చిక్కుకుని నరకయాతన అనుభవించారు. Scary situation & #GreatRescue: Farmers digging new well in the hope of finding water in Gandhipuram Village #Mahbubabad #Telangana hit rock, so they got in to examine but surrounding earth collapsed, almost burying them alive; thankfully rescued by those around, using machinery pic.twitter.com/rJxFon28VM — Uma Sudhir (@umasudhir) April 3, 2024 ఈ విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో హుటాహుటినా సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు జేసీబీల సహాయంతో సుమారు రెండు గంటలపాటు శ్రమించి రైతును, కూలీలిద్దరిని సురక్షితంగా ప్రాణాలతో బయటకు తీశారు. సుధాకర్, సురేశ్ లు స్వల్పగాయాలతో బయటపడ్డారు. దీంతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఊపిరిపీల్చుకున్నారు. ప్రమాదం విషయం తెలిసిన వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని వ్యవసాయ బావిలో చిక్కుకున్న ఇద్దర్నీ కాపాడిన పోలీసులను అక్కడున్నవారంతా అభినందించారు. Scary situation & #GreatRescue: Farmers digging new well in the hope of finding water in Gandhipuram Village #Mahbubabad #Telangana hit rock, so they got in to examine but surrounding earth collapsed, almost burying them alive; thankfully rescued by those around, using machinery pic.twitter.com/rJxFon28VM — Uma Sudhir (@umasudhir) April 3, 2024 ఇది కూడా చదవండి : ఉగాది నుంచి ఈ ఐదు రాశుల వారికి పట్టుకుందల్లా బంగారమే..! #two-persons-trapped-in-well మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి