జమ్మూకశ్మీర్ పహల్గాంలో జరిగిన ఉగ్రదాడితో దేశ వ్యాప్తంగా భయాందోళన మొదలైంది. కశ్మీర్ టూర్‌కి వెళ్లాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. 28 మంది పర్యాటకులను టీఆర్‌ఎఫ్ ఉగ్రవాదుల కాల్చి చంపారు. వీరిలో చాలా మంది మృతి చెందారు. కొత్త పెళ్లయిన వారిని కూడా దారుణం కాల్చి చంపేశారు. ఓ లెఫ్టినెంట్ నేవీ అధికారి వినయర్ నర్వాల్ (26) ఆరు రోజుల కిందటే పెళ్లి జరిగింది. హనీమూన్‌కి వెళ్లగా ఉగ్రవాదులు కాల్చి చంపారు.
ఇది కూడా చూడండి: PM Modi: సౌదీ పర్యటన మధ్యలోనే ముగించుకుని వెనక్కు వచ్చేసిన ప్రధాని మోదీ
భార్య, కుమారుడిని వదిలేసి..
వీరే కాకుండా మరో ఫ్యామిలీ కూడా ఈ ఉగ్రదాడికి బలైంది. పశ్చిమ బెంగాల్‌కు చెందిన బితాన్ అమెరికాలోని ఫ్లోరిడాలో ఉంటున్నాడు. అక్కడ టీసీఎస్‌లో పనిచేస్తున్న బితాన్ సొంతూరు అయిన పశ్చిమ బెంగాల్‌కి ఇటీవల వచ్చారు. ఈ క్రమంలో భార్య, కొడుకుతో కలిసి వెకేషన్ కోసం కశ్మీర్ వెళ్లగా.. ప్రాణాలు కోల్పోయాడు. ఈ దాడిలో భార్య పిల్లలను వదిలేసి.. బితాన్‌ను చంపేశారు. భర్త చనిపోవడంతో భార్య కన్నీరుమున్నీరు అవుతుంది. అతని కుటుంబ సభ్యులు కూడా రోధిస్తున్నారు.
ఇది కూడా చూడండి: Pahalgam: పహల్గామ్ లో నంబర్ ప్లేట్ లేని బైక్..ఉగ్రవాదులదేమోనని అనుమానం
అలాగే ఓ లెఫ్టినెంట్ నేవీ అధికారి వినయర్ నర్వాల్ (26) ఆరు రోజుల కిందటే పెళ్లి జరిగింది. హనీమూన్‌కి వెళ్లగా ఉగ్రవాదులు కాల్చి చంపారు. ఏప్రిల్ 16న ఆయనకు వివాహం జరిగింది. హనీమూన్ కోసం ఆయన తన సతీమణితో కశ్మీర్‌కు వచ్చారు. పెళ్లై కనీసం వారం రోజులు కూడా గడవకముందే వినయ్ జీవితం ఉగ్రవాదులకు బలైపోయింది.
ఇది కూడా చూడండి: J&K TerrorAttack:ఉగ్రదాడిలో హైదరాబాద్ వాసి మృతి.. శివమొగ్గ కు చెందిన వ్యాపారవేత్త ...!
భర్తను కోల్పోయిన ఆ నవవధువ ఆవేదన అందరినీ కన్నీ్ళ్లు పెట్టిస్తోంది. ఆమె రోదిస్తూ.. '' మాకు పెళ్లయి ఆరు రోజులే అయ్యింది. ఈ ఘటన జరిగినప్పడు మేము పానీపూరీ తింటున్నాం. ఒక్కసారిగా ఓ ఉగ్రవాది మా వద్దకు వచ్చాడు. నీ భర్త ముస్లిం కాదు కదా అని అడిగాడు. వెంటనే తన తలకు తుపాకీ గురిపెట్టి కాల్చి వెళ్లిపోయాడని'' ఆమె ఏడుస్తూ చెప్పిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.