Tummala: కాంగ్రెస్‌ పార్టీలో చేరిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

తెలంగాణ మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. సీడబ్ల్యూసీ సమావేశం కోసం హైదరాబాద్‌లోని తాజ్‌కృష్ణ హోటల్‌కు వచ్చిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే తుమ్మలకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

New Update
Tummala: కాంగ్రెస్‌ పార్టీలో చేరిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు

Tummala: తెలంగాణ మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. సీడబ్ల్యూసీ సమావేశం కోసం హైదరాబాద్‌లోని తాజ్‌కృష్ణ హోటల్‌కు వచ్చిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే తుమ్మలకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సహా ముఖ్య నేతలంతా పాల్గొన్నారు. అంతకుముందు బీఆర్‌ఎస్ పార్టీకి రాజీనామా చేసిన లేఖను సీఎం కేసీఆర్‌కు పంపించారు. 'తెలంగాణ రాష్ట్ర సమితిలో నాకు సహకరించినందుకు ధన్యవాదాలు. పార్టీకి నా రాజీనామాను సమర్పిస్తున్నాను' అంటూ రాజీనామా లేఖలో పేర్కొన్నారు.

ఇటీవల తుమ్మల నివాసానికి ఏఐసీసీ ఇంచార్జ్ మానిక్ రావ్ ఠాక్రే, పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, సిఎల్పీ నేత భట్టి విక్రమార్క, ప్రచార కమిటీ కోచైర్మన్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెళ్లారు. పార్టీలో చేరిక పైన తీవ్రంగా చర్చించిన అనంతరం కాంగ్రెస్‌లో చేరేందుకు తుమ్మల గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

2014లో BRSలో చేరిన తుమ్మల 2016 ఉపఎన్నికలో పాలేరు నుంచి BRS తరఫున పోటీ చేసి గెలిచారు. కానీ 2018 సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఆ తరువాత పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి BRSలో చేరడంతో తుమ్మలకు ప్రాధాన్యత తగ్గింది. అయితే ఈసారి ఎలాగైనా పాలేరు నుంచి పోటీ చేయాలని తుమ్మల భావించారు. కానీ కేసీఆర్ సిట్టింగ్ ఎమ్మెల్యేకే టికెట్ ఇవ్వడంతో అసంతృప్తికి గురైన ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.  ఈ క్రమంలోనే కార్యకర్తలు, అనుచరులు అభిప్రాయాలు తీసుకుని కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇతర కాంగ్రెస్ నాయకులు తుమ్మలను కలిసి పార్టీలోకి ఆహ్వానించారు. అయితే పాలేరు నుంచి సీటు విషయంలో సరైన హామీ రాకపోవడంతో తుమ్మల చేరిక ఆలస్యమైంది.

తెలంగాణ రాజకీయాల్లో అత్యంత సీనియర్ నేత అయిన తుమ్మల 1985, 1994, 1999, 2009 ఎన్నికల్లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం రాష్ట్ర విభజన తర్వాత  బీఆర్ఎస్ పార్టీలో చేరి మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. తాజాగా హస్తం తీర్థం పుచ్చుకున్నారు.

ఇది కూడా చదవండి: ఖమ్మం కాంగ్రెస్‌లో మూడు స్తంభాలాట.. ఇలా అయితే ఎలా..?

Advertisment
Advertisment
తాజా కథనాలు