శ్రీవారి భక్తులకు అలర్ట్.. వైకుంఠ ద్వార దర్శనం టికెట్లు జారీ ఎప్పటి నుంచంటే.. టీటీడీ కీలక ప్రకటన జారీ చేసింది. వచ్చేనెల అంటే డిసెంబర్ 23వ తేదీ నుంచి 2024 జనవరి 1వ తేదీ వరకు శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించిన 2.25 లక్షల రూ. 300 దర్శనం టికెట్లను నవంబర్ 10 వ తేదీన ఆన్ లైన్ లో విడుదల చేయనుంది. By Shiva.K 04 Nov 2023 in ఆంధ్రప్రదేశ్ తిరుపతి New Update షేర్ చేయండి Vaikunta Dwara Darshan tickets: తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలనుకునే భక్తుల కీలక అప్‌డేట్ ఇచ్చింది టీటీడీ. 23 డిసెంబరు 2023 నుండి 2024 జనవరి 1వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించిన 2.25 లక్షల రూ.300/- దర్శన టికెట్ల కోటాను నవంబరు 10వ తేదీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు. ఈ మేరకు టీటీడీ ఈవో ధర్మారెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు. తిరుమల అన్నమయ్య భవనంలో శుక్రవారం డయల్ యువర్ ఈవో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ.. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ ఏడాది డిసెంబరు 23 నుండి జనవరి 1వ తేదీ వరకు 10 రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తామని తెలిపారు. డిసెంబరు 22వ తేదీన తిరుపతిలో 9 కేంద్రాలలో 100 కౌంటర్లలో వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించిన 4.25 లక్షల టైంస్లాట్ సర్వదర్శనం టోకెన్లను జారీ చేస్తామని తెలిపారు ఈవో. 10 రోజులకు సంబంధించిన టికెట్లన్నీ ఆ రోజు జారీ చేయడం జరుగుతుందన్నారు. ఇక డిసెంబరు 23వ తేదీ నుంచి జనవరి 1వ తేదీ వరకు ప్రత్యేక దర్శనాలైన చంటిపిల్లలు, దివ్యాంగులు, వయోవృద్ధులు, ఎన్‌ఆర్‌ఐల దర్శనాలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది టీటీడీ. రోజుకు రెండు వేల శ్రీవాణి టికెట్లు.. తిరుమల శ్రీవారి ఆలయంలో 23 డిసెంబరు 2023 నుంచి 1 జనవరి 2024 వరకు వైకుంఠ ద్వార దర్శనం కోసం రోజుకు 2,000 టికెట్లు చొప్పున ఆన్‌లైన్‌లో శ్రీవాణి టెకెట్లు విడుదల చేస్తామని ఈవో తెలిపారు. భక్తులు శ్రీవాణి ట్రస్టుకు రూ.10 వేలు విరాళం ఇవ్వడంతో పాటు రూ.300/- దర్శన టిక్కెట్ కొనుగోలు చేయాల్సి ఉంటుదన్నారు. ఈ టికెట్లను పొందిన భక్తులకు మహా లఘు దర్శనం(జయ విజయుల వద్ద నుండి మాత్రమే) ఉంటుందని టీటీడీ ఈవో తెలిపారు. Also Read: కోమటిరెడ్డి బ్రదర్స్ సంగతి చూస్తా! చిరుమర్తి లింగయ్య సెన్సేషన్ కామెంట్స్.. ఎన్నికల్లో పోటీకి షర్మిల వెనుకడుగు.. పొంగులేటి వ్యూహం ఫలితమేనా?! #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి