ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పిన టీఎస్ ఆర్టీసీ ప్రయాణికులకు టీఎస్ ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. T9 (30) (T9 (30) Ticket) రోజు వారి టికెట్ ధరను అందుబాటులోకి తీసుకువచ్చింది. గ్రామాల్లో ఉండే వారి కోసం . T9 (30 టికెట్ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. ప్రయాణికులు దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు By Karthik 26 Jul 2023 in Scrolling తెలంగాణ New Update షేర్ చేయండి ప్రయాణికులకు టీఎస్ ఆర్టీసీ (ts rtc) గుడ్ న్యూస్ చెప్పింది. T9 (30) (T9 (30) Ticket) రోజు వారి టికెట్ ధరను అందుబాటులోకి తీసుకువచ్చింది. 50 రూపాయలు చెల్లించి గ్రామంలోని ఏ బస్సులో అయినా 30 కిలో మీటర్ల వరకు ప్రయాణం చేయవచ్చు. జూలై 26(బుధవారం) హైదరాబాద్(Hyderabad)లోని బస్ భవన్‌లో (Bus Bhavan) ఆర్టీసీ చైర్మన్, ఎండీ సజ్జనార్ (Sajjanar) T9(30) టికెట్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సజ్జనార్ (Sajjanar) మాట్లాడుతూ.. గ్రామస్థాయిలో ఉండే ప్రయాణికుల సౌకర్యం కోసం T9(30)ని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వెల్లడించారు. ప్రయాణికులు 50 రూపాయలు చెల్లించి పల్లె వెలుగు బస్సుల్లో 30 కిలో మీటర్ల వరకు ప్రయాణించవచ్చని వివరించారు. ఈ నెల 27 (గురువారం) నుంచి T9 (30) టికెట్ అందుబాటులోకి వస్తుందని తెలిపారు. దీంతోపాటు 20 రూపాయల కాంబితో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ప్రయాణించే సదుపాయం సైతం కల్పించింది. ఈ టికెట్లు పల్లె వెలుగు బస్సుల్లోని కండక్టర్ల వద్ద అందుబాటులో ఉంటాయని తెలిపింది. టీ9(30) టికెట్ వల్ల ప్రతీ ఒక్కరికి 10 రూపాలయ నుంచి 30 రూపాయల వరకు ఆదా అవ్వనుంది. కాగా టీఎస్ ఆర్టీసీ (ts rtc) ఇటీవల టీ9(60) సర్వీస్‌ను సైతం అందుబాటులోకి తసుకొచ్చింది. ప్రయాణికులు 100 రూపాయలు చెల్లించి 60 కిలో మీటర్లు ప్రయాణించవచ్చని, దీనిని మహిళలు, వృద్ధులు కోసం తీసుకొచ్చినట్లు గతంలో తెలిపారు. కాగా ప్రస్తుతం తీసుకువచ్చిన T9(30)మహిళలకు(Women), వృద్ధులకు (old people) సైతం వర్తిస్తుందని తెలిపారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాల కోసం టీఎస్ ఆర్టీసీ (ts rtc) కాల్ సెంటర్లను ఏర్పాటు చేసింది ఫోన్ నెంబర్లు 040-69440000, 040-23450033కి కాల్ చేసి ఆర్టీసీ అందిస్తున్న సేవల గురించి తెలుసుకోవచ్చని ఆర్టీసీ అధికారులు తెలిపారు. తెలంగాణ ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ బాధ్యతలు తిసుకున్న నాటి నుంచి నష్టాల్లో ఉన్న ఆర్టీసీని లాభాల బాట పట్టించాలని అన్ని విధాలా చర్యలు తీసుకుంటున్నారు. గతంలో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించిన వారికి బహుమతులు పంపిణీ చేశారు. అనంతరం శుభకార్యాలకు (weddings) బస్సులను అద్దెకు ఇస్తామని ప్రకటించారు. దీంతో పాటు హైదరాబాద్‌లో డే పాస్(Day Pass)ల ధరలకు తగ్గించారు. ఆర్టీసీ బస్సుల్లో వెళ్లే ప్రయాణికులను సమ్మక్క-సారలమ్మ గద్దె వరకు తీసుకెళ్లడం, తిరుమల(Tirumala)కు వెళ్లే భక్తుల కోసం వీఐపీ దర్శనం లాంటి ఆఫర్లను తీసుకొచ్చిన సజ్జనార్.. ప్రయాణికుల్లో ఆర్టీసీ(rtc)పై నమ్మకం తీసుకొచ్చారు. దీంతో గతంలో ఆర్టీసీలో ప్రయాణించిన వారితో పోల్చితే ప్రస్తుతం ఆర్టీసీలో ప్రయాణిస్తున్న వారి సంఖ్య పెరిగింది. మరోవైపు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థ కొత్త బస్సులను(New buses)కూడా నడుపుతోంది. పదే పదే పాత బస్సులు మొరాయిస్తుండటం, ప్రయాణికులు పాత బస్సుల్లో ఎక్కకపోవడంతో ఆర్టీసీ కొత్త బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది. అంతేకాకుండా రానున్న వారం రోజుల్లో హైదరాబాద్ (Hyderabad)నగరంలో ఎలక్ట్రికల్ బస్సులను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆర్టీసీ తెలిపింది. #ts-rtc #ticket #t930 #30-kms #palle-veluk-bus మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి