TSRTC: ఎంత పనిచేశావ్ మహాలక్ష్మీ..భారీగా తగ్గిన బస్ పాసులు..! టీఎస్ఆర్టీసీ బస్‌పాస్‌లు భారీగా తగ్గాయి. మహాలక్ష్మీ పథకం ద్వారా గ్రేటర్ పరిధిలో ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగినా..బస్ పాస్ సంఖ్య మాత్రం తగ్గింది. ప్రయాణికులు పెరిగినప్పటికీ పాస్ లు ఎందుకు తగ్గాయో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. By Bhoomi 08 Apr 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Mahalaxmi Scheme: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు ఫ్రీగా బస్సు జర్నీ (Free Bus) సౌకర్యం కల్పించింది. దీంతో టీఎస్ఆర్టీసీకి ప్రయాణికులు పెరిగినా ఆదాయం మాత్రం గణనీయంగా తగ్గిపోయింది. అంతకుముందు సిటీ బస్సుల్లో 11లక్షల మంది ప్రయాణించేవారు. ప్రస్తుతం ఆ సంఖ్య 21 లక్షలకు పెరిగింది. ఈ వార్త సంస్థకు సంతోషినిస్తే..బస్ పాస్ లు (Bus Pass) మాత్రం 40శాతం తగ్గడంతో ఒక్కింత నిరాశే ఎదురైంది. నగరంలో గత మూడు నెలల్లో ఈ తగ్గుదల కనిపించిందని అధికారులు చెబుతున్నారు. డిసెంబర్ 9న రాష్ట్రంలో మహిళలకు ఫ్రీ బస్సు జర్నీ సౌకర్యం పథకం మహాలక్ష్మీ అందుబాటులోకి వచ్చింది. దీంతో మహిళలకు నగరంలో తిరిగే బస్సుల్లో ఫ్రీ జర్నీ కల్పించారు. ఫలితంగా ప్రయాణికులు భారీగా పెరిగినప్పటికీ..పాస్ లు మాత్రం అదే స్థాయిలో తగ్గాయి. రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన వారు హైదరాబాద్ లో నివసిస్తుంటారు. కొందరు ఉద్యోగాల కోసం, మరికొందరు చదువుకునేందుకు నగరానికి వస్తుంటారు. ఇక్కడికి వలస వచ్చిన చాలా మంది ప్రజారవాణాపైన్నే ఆధారపడుతుంటారు. నెలంతా ప్రయాణించేందుకు ఒకే సారి బస్ పాస్ లు తీసుకుంటారు. అయితే నగరంలో ప్రస్తుతం విద్యార్థుల బస్ పాలు లక్షా 60వేలు ఉండగా..జనరల్ పాసులు 90వేలు ఉన్నాయి. దివ్యాంగుల పాసులు 30వేలు, ఎన్జీవోలు 2వేల వరకు ఉన్నాయి. గ్రేటర్ పరిధిలో అన్ని రకాల పాస్ లు కలిపి దాదాపు 3లక్షల వరకు ఉన్నాయి. మహాలక్ష్మీ పథకం అందుబాటులోకి వచ్చిన తర్వాత నగరంలో ఉండే అన్ని రకాల బస్ పాస్ లపై ప్రభావం పడిందని అధికారులు చెబుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న సమయంలో హైదరాబాద్ నగరంలో 7లక్షలకు పైగా బస్ పాస్ లు ఉండేవని అధికారులు తెలిపారు. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత వాటి సంఖ్య 4.50లక్షలకు పడిపోయింది. కోవిడ్ సమయంలోనూ ఆర్టీసీ భారీగానే నష్టాలను ఎదుర్కొంది. అప్పుడు 3.9లక్షల వరకు పాస్ లు తగ్గాయి. ఇప్పుడు మహాలక్ష్మీ పథకం అమలుతో వాటి సంఖ్య 2.82లక్షలకు పడిపోయినట్లు ఆర్టీసీ గణాంకాలు చెబుతున్నాయి. నగరంలో ప్రస్తుతం 2వేల 850 బస్సులు తిరుగుతున్నాయి. అయితే బస్సులు చాలా తక్కువగా ఉండటంతో చాలా మంది వ్యక్తిగత వాహనాలు వినియోగించడంతో పాసుల సంఖ్య తగ్గి కాలుష్యం, ట్రాఫిక్ ఎక్కువైనట్లు చెబుతున్నారు. ఇది కూడా చదవండి: బిఆర్ఎస్ కు బిగ్ షాక్..మెదక్ పార్లమెంట్ అభ్యర్థిపై కేసు నమోదు.! #ts-rtc #mahalakshmi-effect మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి