టీఎస్ఆర్టీసీ బిల్ ఎఫెక్ట్..అసెంబ్లీ సమావేశాల పొడగింపు ఆలోచనలో సర్కార్!!

టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ తీసుకొచ్చిన ఆర్టీసీ బిల్ ఎఫెక్ట్ అసెంబ్లీ సమావేశాలపై పడుతోంది. వాస్తవానికి నిన్నటికే ముగియాల్సిన సమావేశాలను ప్రభుత్వం ఈ రోజుకు పొడగించింది. కాగా, ఆర్టీసీ బిల్లు గ్రీన్ సిగ్నల్ పొందేందుకు సమావేశాలను మరింత పొడగించాలని తెలంగాణ సర్కార్ యోచిస్తోంది..

New Update
మరో రెండు రోజులు అసెంబ్లీ సమావేశాలు..ఆర్టీసీ బిల్ పై చర్చ!!

టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ తీసుకొచ్చిన ఆర్టీసీ బిల్ ఎఫెక్ట్ అసెంబ్లీ సమావేశాలపై పడుతోంది. వాస్తవానికి నిన్నటికే ముగియాల్సిన సమావేశాలను ప్రభుత్వం ఈ రోజుకు పొడగించింది. కాగా, ఆర్టీసీ బిల్లు గ్రీన్ సిగ్నల్ పొందేందుకు సమావేశాలను మరింత పొడగించాలని తెలంగాణ సర్కార్ యోచిస్తున్నట్లు సమాచారం.  మరో వైపు ఈ బిల్లు పై ఉత్కంఠ నెలకొంది.

శనివారం రాత్రే గవర్నర్ తమిళి సై పుదుచ్చేరి నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. ఇలా ఉంటే.. బిల్లు పై గవర్నర్ వ్యక్తం చేసిన 5 సందేహాలకు ప్రభుత్వం తరుపు నుంచి ప్రధాన కార్యదర్శి శాంతికుమారి రాత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. దీంతో ఆమె సంతృప్తి చెందినట్టు తెలుస్తోంది. మరోవైపు ఆర్టీసీ బిల్లుకు ఆమోదం తెలపాలని ఆర్టీసీ ఉద్యోగులు రాజ్ భవన్ ను నిన్న ముట్టడించారు.

దీంతో ఆమె పుదుచ్చేరి నుంచే వీడియో కాన్ఫరెన్స్ లో ఆర్టీసీ యూనియన్ల లీడర్లు, ఉద్యోగులతో మాట్లాడి సానుకూలంగా స్పందించారు. దీంతో దాదాపుగా బిల్లుకు ఆమె ఆమోదం తెలుపుతారనే అందరూ ఎదురుచూస్తున్నారు. మరి రాజ్ భవన్ నిర్ణయం ఏవిధంగా ఉంటుందని ఉత్కంఠగా మారింది. ప్రభుత్వం మాత్రం ఈ బిల్లుకు గవర్నర్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే ఉభయ సభల్లో చర్చించి.. ఆమోదించి.. వెంటనే చట్టం చేయాలని యోచిస్తోంది. దీనికోసమే ఈ రోజు సభను నిర్వహిస్తోంది. అలాగే సమావేశాలను ఈ బిల్లు కొలిక్కి వచ్చే వరకు నిర్వహించాలని కేసీఆర్ సర్కార్ భావిస్తోంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు