BRS in Kamman:ఖమ్మంలో రంగంలోకి ట్రబుల్ షూటర్..పొంగులేటికి చెక్!! రాష్ట్ర రాజకీయాలన్నీ ఓ ఎత్తైతే.. ఖమ్మం పాలిటిక్స్ ఓ ఎత్తు అన్నట్టుగా ప్రస్తుత పరిస్థితులు నెలకొన్నాయి. బీఆర్ఎస్ నుంచి బయటికొచ్చి రెబల్ రోల్ ప్లే చేస్తున్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గులాబీ దళానికి చేసిన ఛాలెంజ్ యే అందుకు కారణం. దీంతో ఖమ్మంపై గులాబీ బాస్ స్పెషల్ ఫోకస్ పెట్టారు. ట్రబుల్ షూటర్ మంత్రి హరీష్ రావ్ కు ఖమ్మం జిల్లా ఇన్చార్జ్ గా బాధ్యతలు అప్పగించారు.. By P. Sonika Chandra 20 Aug 2023 in రాజకీయాలు New Update షేర్ చేయండి BRS in Kamman: రాష్ట్ర రాజకీయాలన్నీ ఓ ఎత్తైతే.. ఖమ్మం పాలిటిక్స్ ఓ ఎత్తు అన్నట్టుగా ప్రస్తుత పరిస్థితులు నెలకొన్నాయి. బీఆర్ఎస్ నుంచి బయటికొచ్చి రెబల్ రోల్ ప్లే చేస్తున్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గులాబీ దళానికి చేసిన ఛాలెంజ్ యే అందుకు కారణం. దీంతో ఖమ్మంపై గులాబీ బాస్ స్పెషల్ ఫోకస్ పెట్టారు. ట్రబుల్ షూటర్ మంత్రి హరీష్ రావ్ కు ఖమ్మం జిల్లా ఇన్చార్జ్ గా బాధ్యతలు అప్పగించారు. అదే సమయంలో ఆ జిల్లా నేతలకు ప్రగతి భవన్ అపాయింట్మెంట్ కరువైంది. ఖమ్మంలో అభ్యర్థుల ప్రకటనతో రాజకీయ ప్రకంపనలు..! బీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటనతో ఖమ్మం జిల్లాలో రాజకీయ ప్రకంపనలు మొదలయ్యాయి. అసంతృప్తులు, అసమ్మతినేతలు మంత్రి హరీష్ రావ్ దగ్గరకి క్యూ కట్టారు. ఇక మాజీమంత్రి తుమ్మల రెండు రోజులుగా హైదరాబాద్ లోనే మకాం వేశారు. టికెట్ విషయంలో అటో.. ఇటో.. తేల్చుకునే వస్తానంటూ క్యాడర్ కు చెప్పారు. పాలేరు నియోజకవర్గం నుంచి టికెట్ ఆశిస్తున్న తుమ్మల నాగేశ్వరరావు ఈరోజు ఉదయం తనవర్గం నేతలతో కలిసి హైదరాబాద్ కు చేరుకున్నారు. మరోవైపు ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ అసమ్మతి నేతల వ్యవహరంపై అధిష్టానానికి ఫిర్యాదు చేయడానికి సిద్దమవుతున్నట్టు సమాచారం. అసమ్మతుల హడావుడి..! ఇల్లందు నుంచి నిజాం లా కళాశాల ప్రిన్సిపాల్ టికెట్ ఆశిస్తున్నారు. ఇక వైరాలో సోషల్ వార్ పై మంత్రి హరీష్ రావ్ కు మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే రాములు నాయక్ వ్యవహారంపై యాక్షన్ తీసుకోవాలని వినతి పత్రం ఇచ్చారు. అయితే ఇరువురు నేతలతో మంత్రి హరీష్ రావ్ భేటీ కానున్నారు. ఇక ఇలా ఉంటే జిల్లా ఇన్చార్జి మంత్రి పువ్వాడ అజయ్ తో పాటు ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తాతామధు హైదరాబాద్ లోనే మకాం వేశారు. వాళ్లు జిల్లా రాజకీయాలపై ఎప్పటికప్పుడు అధిష్టానానికి సమాచారం అందచేస్తున్నారు. కొత్తగూడెం టికెట్ పై తీవ్ర ఉత్కంఠ..! కొత్తగూడెం బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిత్వంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. టికెట్ తనదేనంటూ సిట్టింగ్ ఎమ్మెల్యే వనమా ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు ఇంకా ఆశలు పెట్టుకున్నారు. సీఎం కేసీఆర్ ఫోన్ కాల్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇక ఇలా ఉంటే..ఎప్పటి నుంచే టికెట్ ఆశిస్తూ గడప.. గడపకు గడల అంటూ ప్రచారానికి తెరలేపిన డైరెక్టర్ ఆఫ్ హెల్త్ గడల శ్రీనివాస్ రావ్ కొత్తగూడెం చేరుకున్నారు. మధిర టికెట్ కోసం పోటాపోటీ..! కొత్తగూడెం తరువాత మధిర టికెట్ రేస్ లో చాలా పెద్ద లిస్టే ఉంది. ఈ క్రమంలో అధిష్టానం మద్దతు తనకే అంటూ.. మధిర నుంచి టికెట్ ఆశిస్తున్న బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జ్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరో వైపు ఖమ్మం జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజ్ తెలంగాణ ఉద్యమకారుల కోటాలో మధిర టికెట్ ఆశిస్తున్నారు. ఇక ఇలా ఉంటే బొమ్మెర రామ్మూర్తి మధిర టికెట్ కేటాయించాలంటూ నిరసన దీక్షకు దిగే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తానికి ఖమ్మం పాలిటిక్స్ ను గాడిలో పెట్టడానికి బీఆర్ఎస్ అధిష్టానం భారీ కసరత్తు చేయక తప్పడం లేదు. ప్రతిపక్షానికి అడ్డుకట్ట వేస్తూనే.. స్వపక్షంలో నేతల్లో టిక్కెట్ల విషయంలో నెలకొన్న అసంతృప్తికి చెక్ పెట్టడం అధిష్టానానికి పెద్ద టాస్క్ గానే మారింది. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి