AP: గిరిజనులకు తప్పని డోలి కష్టాలు.. మార్గ మధ్యలోనే..

విజయనగరం జిల్లా మారిక గ్రామ గిరిజనులకు డోలి కష్టాలు తప్పడం లేదు. డోలి మోతలు వలన ప్రాణాలు కోల్పోతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు రోడ్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని అధికారులు ఇప్పటికైనా తమ గ్రామానికి రోడ్లు వేయాలని వేడుకుంటున్నారు.

New Update
AP: గిరిజనులకు తప్పని డోలి కష్టాలు.. మార్గ మధ్యలోనే..

Vizianagaram: దశాబ్దాలు మారినా గిరిజనులకు డోలి కష్టాలు తప్పడం లేదు. విజయనగరం జిల్లా వేపాడ మండలం కరకవలస పంచాయతిలో మారిక గ్రామ గిరిజనులు డోలి కష్టాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. డోలి మోతల వలన ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా, బాధిత కుటుంబ సభ్యులతో RTV ఎక్స్ క్లూజివ్ గా మాట్లాడి వారి బాధలు తెలుసుకుంది. డోలి మోసుకొని వెళుతుండడంతో మార్గ మధ్యలోనే ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

తమకు ఏ ఆరోగ్య సమస్య వచ్చిన డోలీ మోత బ్రతుకులు తప్పడం లేదని వాపోతున్నారు. గర్భిణీ స్త్రీలు, బాలింతల బాధ చెప్పలేనిదంటూ కన్నీటిపర్యంతం అవుతున్నారు. సుమారుగా 10 కిలోమీటర్ల పాటు (ఊయల) డోలీతో వెళ్లాలని తమ బాధను చెప్పుకున్నారు. ఏళ్లు గడిచినా, ప్రభుత్వాలు మారినా తమ బ్రతుకులు బాగుపడటం లేదని.. అధికారులు ఇప్పటికైనా స్పందించి తమ గ్రామానికి రోడ్లు వేయాలని వేడుకుంటున్నారు.

Also Read: ఆంధ్ర – తెలంగాణ మధ్య నిలిచిన రాకపోకలు.. కారణం ఇదే..!

Advertisment
Advertisment
తాజా కథనాలు