Traffic Diversion: పోటాపోటీ రాజకీయ కార్యక్రమాలు.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు..

తెలంగాణ ఎన్నికలకు మరికొద్ది రోజులే సమయం ఉండటంతో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. పార్టీలన్ని రాజకీయ కార్యక్రమాలకు సిద్ధమయ్యాయి. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ ప్రభుత్వం ఇవాళ జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని నిర్వహిస్తుంటే.. మరోవైపు బీజేపీ.. కేంద్ర ప్రభుత్వం తరఫున తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తోంది.

New Update
Traffic Rules : హైదరాబాద్ వాసులకు అలర్ట్.. ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు!

Traffic Diversion: తెలంగాణ ఎన్నికలకు మరికొద్ది రోజులే సమయం ఉండటంతో రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. పార్టీలన్ని రాజకీయ కార్యక్రమాలకు సిద్ధమయ్యాయి. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ ప్రభుత్వం ఇవాళ జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని నిర్వహిస్తుంటే.. మరోవైపు బీజేపీ.. కేంద్ర ప్రభుత్వం తరఫున తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. అనంతరం పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగే విమోన దినోత్సవ వేడుకలకు హాజరయ్యారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

ఇది కూడా చదవండి: సర్దార్ పటేల్ వల్లే తెలంగాణకు విముక్తి లభించింది: అమిత్ షా

పరేడ్ గ్రౌండ్స్, సికింద్రాబాద్, పరేడ్ గ్రౌండ్ చుట్టుపక్కల రోడ్ల వైపు ఆంక్షలు విధించారు. టివోలి ఎక్స్-రోడ్స్ నుండి ప్లాజా ఎక్స్-రోడ్స్ మధ్య రోడ్డు మూసివేశారు. అలాగే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వెళ్లాలనుకునే ప్రయాణికులు ట్రాఫిక్ ఆంక్షల దృష్ట్యా త్వరగా బయలుదేరాలని పోలీసులు సూచించారు. UPSC సివిల్ సర్వీస్ మెయిన్స్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు తమ హాల్ టికెట్/ఐడీ కార్డ్‌ని చూపిస్తే వారిని అనుమతించడం జరుగుతుందన్నారు. అలాగే చిలకలగూడ క్రాస్ రోడ్లు, ఆలుగడ్డ బాయి క్రాస్ రోడ్లు, సంగీత్ ఎక్స్ రోడ్స్, YMCA క్రాస్ రోడ్, పాట్నీ X రోడ్, SBH X రోడ్, ప్లాజా, CTO జంక్షన్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయన్నారు.

వీటితో పాటు ట్రాఫిక్ ఆంక్షలు ఉండే ప్రాంతాలు

1. బ్రూక్‌బాండ్ జంక్షన్
2. టివోలి జంక్షన్
3. స్వీకర్ ఉపాకర్ జంక్షన్
4. సికింద్రాబాద్ క్లబ్
5. త్రిముల్‌గేరీ X రోడ్
6. టాడ్‌బండ్ X రోడ్
7. సెంటర్ పాయింట్
8. డైమండ్ పాయింట్
9. బోవెన్‌పల్లి X రోడ్
10. రసూల్‌పురా, బేగంపేట్

ఇది కూడా చదవండి: తెలంగాణ పథకాలు దేశంలోని పలు రాష్ట్రాలకు స్ఫూర్తి: కేసీఆర్

Advertisment
Advertisment
తాజా కథనాలు