శరీరంలోని వేడిని వీటితో తగ్గించండి!

శరీరంలోని వేడిని తగ్గించటానికి నిపుణులు కొన్ని చిట్కాలు చెబుతున్నారు. పుచ్చకాయ లాంటి చలవైన పదార్థాలను తీసుకోవటం ,తరచూ కొబ్బరి నీళ్లు,మజ్జిగ త్రాగటం వల్ల వేడి తగ్గుతుందని వారు అంటున్నారు. అంతేకాకుండా జంక్ ఫుడ్స్,ఆయిల్ ఫుడ్స్ కు దూరంగా ఉండటం మంచిదని వారు సూచిస్తున్నారు.

New Update
శరీరంలోని వేడిని వీటితో తగ్గించండి!

ఉద‌యాన్నే గ్లాసుడు నిమ్మ‌ర‌సం తాగితే..ఒంట్లో వేడి త‌గ్గుతుంది. ఉప్పు, లేదా పంచ‌దార వేసుకుని నిమ్మ నీళ్ళ తాగొచ్చు. పుచ్చకాయ తింటే శరీరంలో వున్న వేడి తగ్గిపోతుంది. పాలలో గసగసాల పొడిని కలుపుకుని తాగినా ఫలితం వుంటుంది. రోజూ రెండుసార్లు కొబ్బరినీళ్లు తాగినా ఫలితం వుంటుంది. అస‌లు మంచి నీళ్లు బాగా తాగితే శ‌రీరంలో వేడి త‌గ్గిపోయి స‌మ ఉష్ణోగ్ర‌త ఏర్ప‌డుతుంది.

కొన్ని బార్లీ గింజ‌లు వేడి నీళ్ళ‌లో కాచి, మ‌జ్జిగ వేసుకుని ప‌ల‌చ‌గా తాగితే వేడి త‌గ్గుతుంది. అలోవెరా జ్యూస్ తాగితే చ‌ల‌వ చేస్తుంది అలాగే దాని ఆకుల మ‌ధ్య జెల్ నుదుటికి రాసుకుంటే చ‌ల్ల‌గా హాయిగా ఉంటుంది. గంధం చ‌ల్ల‌ని నీరు, లేదా పాల‌తో క‌లిపి నుదుట‌కు రాసుకుంటే వేడి మ‌టుమాయం. ఇవన్నీ తీసుకున్నకూడా వేడి చేసే శరీరతత్వం ఉన్నవారు తప్పకుండా కొన్ని ఆహార నియమాలు పాటించాలి. ముఖ్యంగా టీ, కాఫీలు అధికంగా తాగరాదు.ఆయిల్ ఫుడ్స్, పచ్చళ్లు, చింతపండు, వెల్లుల్లి, అల్లం, వేడి చేసే పండ్లు అనగా బొప్పాయి, జంక్ ఫుడ్స్ కు దూరంగా ఉండటం మంచిది.

Advertisment
Advertisment
తాజా కథనాలు