Tilak Benefits: నుదిటిపై తిలకం ఎందుకు పెట్టుకుంటారు? దాని లాభాలేంటో తెలుసా? హిందూ సంప్రదాయం ప్రకారం నుదిటిపై తిలకం పెట్టుకోవడం చాలా పవిత్రంగా భావిస్తారు. అంతేకాదు.. నుదిటిపై తిలకం పెట్టుకోవడం ద్వారా ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయట. మెదడు పనితీరు మెరుగు పడటం, తలనొప్పి తగ్గడం, ఏకాగ్రత పెరగడం జరుగుతుందంటున్నారు వేద పండితులు. By Shiva.K 28 Dec 2023 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Tilak Benefits: మన దేశంలో హిందూ మతానికి, హిందూమత సంప్రదానికి ఉన్న ప్రత్యేకతే వేరు. ఏళ్లుగా ప్రజలు హిందూ మత ఆచార సంప్రదాయాలను పాటిస్తూ వస్తున్నారు. ముఖ్యంగా హిందూ మతంలో.. భగవంతుణ్ణి ప్రార్థిస్తున్న సమయంలో అంటే పూజా సమయంలో నుదుటిపై తిలకం పెట్టుకుంటారు. ఎలాంటి పూజ అయినా సరే ముందుగా నుదిటిపై తిలకం పెట్టుకుంటారు. ఆ తరువాతే పూజను ప్రారంభిస్తారు. తిలకం/బొట్టు పెట్టుకోకుండా పూజ అనేది అసంపూర్ణంగా పరిగణించబడుతుంది. అయితే, ఈ తిలకం ఎందుకు పెట్టుకుంటారు? దీనిని పెట్టుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి? మతపరమైన, ఆధ్యాత్మిక నిపుణులు ఏం చేబుతున్నారో ఓసారి తెలుసుకుందాం.. మత విశ్వాసం.. హిందూమత విశ్వాసాల ప్రకారం.. నుదుటిపై తిలకం పెట్టుకోవడం ద్వారా సకల దేవతల ఆశీస్సులు లభిస్తాయని ప్రజల విశ్వాసం. హిందూ మత గ్రంధాలలో కూడా తిలకం గురించి పేర్కొనడం జరిగిందని పండితులు చెబుతున్నారు. ఇది వ్యక్తి మనస్సు, మెదడును ప్రశాంతంగా ఉంచుఉంది. నుదిటిపై తిలకం పెట్టుకోవడం వలన ప్రతికూల శక్తులు వారిని ప్రభావితం చేయబోవని చెబుతున్నారు పండితులు. మనస్సు ప్రశాంతంగా ఉంటుంది.. ప్రతిరోజూ నుదుటిపై తిలకం పెట్టుకోవడం వలన మనసుకు ప్రశాంతత లభిస్తుందని ప్రజల్లో ఒక విశ్వాసం ఉంది. మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడం వల్ల అనవసరమైన చిరాకు, కోపం నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. మనస్సు సంతోషంగా ఉంటుంది. ఇది వ్యక్తిని భక్తి వైపు మళ్లిస్తుంది. నుదిటిపై తిలకం పెట్టుకునే వ్యక్తులు.. తమ లక్ష్యం వైపు సరైన దృష్టి కేంద్రీకరించేందుకు సహకరిస్తుంది. పనిలో విజయం.. మత గ్రంధాల ప్రకారం.. తిలకం పెట్టుకోవడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఏదైనా పనిని ప్రారంభించే ముందు భగవంతుని ఆశీర్వాదంతో పాటు తిలకం కూడా పెట్టుకుంటే.. ఆ పని పూర్తి అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటాయని చెబుతున్నారు పండితులు. గ్రహ శాంతి కోసం.. మత విశ్వాసాల ప్రకారం.. జాతకంలో గ్రహాలు ప్రతికూల ప్రభావాలను కలిగి ఉంటే ప్రతి రోజు తిలకం పెట్టుకోవడం వల్ల ప్రతికూల ప్రభావం తొలగిపోతుంది. అందుకే నుదిటిపై తికలం పెట్టుకోవాలని సూచిస్తున్నారు పండితులు. ఆరోగ్య ప్రయోజనాలు.. తిలకం పెట్టుకోవడం మతపరమైన అంశమే కాకుండా.. ఆరోగ్యపరంగా కూడా మేలు చేస్తుందని చెబుతున్నారు పండితులు. రోజూ నుదుటిపై తిలకం రాసుకోవడం వల్ల మెదడులోని నరాలు ప్రశాంతంగా ఉంటాయని, దీని వల్ల తలనొప్పి వంటి సమస్యలు దరిచేరవని చెబుతున్నారు. ఆయుర్వేదం ప్రకారం.. నిద్రలేమి, టెన్షన్ ఉన్నట్లయితే, నుదిటి మధ్యలో మర్దన చేయడం, గంధపు తిలకం రాయడం మేలు జరుగుతుంది. Also Read: మల్కాజిగిరి బీజేపీ అభ్యర్థిగా ఈటల! అమిత్ షా గ్రీన్ సిగ్నల్..! తెలంగాణలో 9 మంది ఐపీఎస్ అధికారుల బదిలీ.. #tilak-benefits మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి