West Godavari : నాలుగు రోజులుగా జిల్లాలో పులి సంచారం.. వణికిపోతున్న జనం!

వారం రోజులుగా ద్వారకా తిరుమల, దెందులూరు, నల్లజర్ల, బుట్టాయిగూడెం మండలాల్లో పెద్దపులి సంచరిస్తున్నట్లు అధికారులు భావిస్తున్నారు.దెందులూరు మండలం మేదినరావుపాలెంలో పులి పాదముద్రలను రైతులు గుర్తించి అటవీ అధికారులకు సమాచారం అందించారు

New Update
West Godavari : నాలుగు రోజులుగా జిల్లాలో పులి సంచారం.. వణికిపోతున్న జనం!

Tiger Hunt : ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా(West Godavari District) ప్రజలను పెద్దపులి భయపెడుతుంది. ఒక్కో చోట ఒక్కో రకంగా పులి పాదముద్రలు(Tiger Foot Prints) కనిపిస్తుండడంతో సంచరించేది పెద్దపులి ఒకటా.. రెండా అనే అనుమానం రేకెత్తిస్తోంది. వారం రోజులుగా ద్వారకా తిరుమల, దెందులూరు, నల్లజర్ల, బుట్టాయిగూడెం మండలాల్లో పెద్దపులి సంచరిస్తున్నట్లు అధికారులు భావిస్తున్నారు.

దెందులూరు మండలం మేదినరావుపాలెంలో పులి పాదముద్రలను రైతులు గుర్తించి అటవీ అధికారులకు(Forest Officers) సమాచారం అందించారు. పాదముద్రలను గుర్తించిన అధికారులు వాటిని పెద్ద పులి పాముద్రలుగా నిర్థారించారు. నాలుగు రోజుల క్రితం నల్లజర్ల మండలం పుల్లలపాడులో పశువులపై పులి దాడి చేసింది. ద్వారకా తిరుమలలో ఆవులపై దాడి చేసి తినేసింది.

ఒక్కోచోట ఒక్కోరకంగా పాదముద్రలు ఉండడంతో తిరుగుతుంది ఒక పులా లేక రెండు పులులా(One or Two Tigers) అనే అనుమానం కలుగుతోంది. వారం రోజుల్లో 40 నుంచి 50 కిలో మీటర్ల పరిధిలో పులి తిరుగుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. పోలవరం కుడికాలువ పరిసర ప్రాంతాల్లో పెద్ద పులి ఎక్కువగా తిరుగుతున్నట్లు స్థానికులు తెలియజేస్తున్నారు.

ఈ క్రమంలోనే పులి జాడ తెలుసుకునేందుకు సుమారు ఆరు బృందాలు ఏర్పడి అటవీ శాఖ సిబ్బంది గాలిస్తున్నారు. పులి సమాచారం ఇవ్వడానికి అటవీ అధికారులు ఇప్పటికే టోల్ ఫ్రీ నంబర్లను కూడా ఏర్పాటు చేశారు. పులి సంచరిస్తున్న ప్రాంతాల్లో రాత్రి సమయాల్లో ప్రజలు కొంచెం జాగ్రత్తగా ఉండాలని , అలాగే పశువులు ఉన్న చోట ఎక్కువ వెలుగు వచ్చే విధంగా ఏర్పాట్లు చేసుకోవాలని అటవీ సిబ్బంది తెలిపారు.

Also Read : రెండు రోజులుగా కనిపించని జార్ఖండ్‌ సీఎం.. సీఎం కుర్చీలో సోరెన్‌ సతీమణి!

Advertisment
Advertisment
తాజా కథనాలు