CRIME: బాత్రూంలో మూడేళ్ల బాలిక పై అత్యాచారం.. ఆపై గొంతు కొరికి చంపేసిన కిరాతకుడు!

మూడేళ్ల బాలిక ను బాత్రూంలో బంధించి అత్యాచారం చేసి,గొంతును పళ్లతో కొరికి  చంపేసిన ఘటన చత్తీస్ గఢ్ లోని బిలాస్ పూర్ లో చోటుచేసుకుంది. 

New Update
Rape Case: తిరుపతిలో దారుణం.. 6 ఏళ్ల బాలికను 65 ఏళ్ల వృద్దుడు ఏం చేశాడంటే!

దేశంలో  బాలికలకు,మహిళలకు రక్షణ లేకుండా పోయిందని మరోసారి రుజువైంది. ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు, కఠిన చర్యలు తీసుకుంటున్నా ఆడ పిల్లలపై అఘాయిత్యాలు మాత్రం ఆగటం లేదు. నిత్యం ఎక్కడో ఓ చోట మానవ మృగాల కామవాంఛకు బలవుతూనే ఉన్నారు. తాజాగా చత్తీస్ గఢ్ లోని బిలాస్ పూర్ లో మూడేళ్ల బాలిక పై  జరిగిన అత్యాచార ఘటన ఇందుకు ఉదాహరణ.

సిర్గిటీ లోని కూలి పనులు చేసుకుంటూ ఓ కుటుంబం జీవనం సాగిస్తుంది. వారికి మూడేళ్ల కూతురు ఉంది. రోజువారిలో భాగంగా ఆదివారం తల్లిదండ్రులు పనికి వెళ్లారు. ఇంటి కి వచ్చిన తల్లి తన కూతురు కనిపించకపోవటంతో ఇంటి చుట్టు ప్రక్కల అంత వెతికింది. ఈ క్రమంలో అటుగా వెళుతున్న ఒకరు ఆమెకు ఒక 14 ఏళ్ల యువకుడు ఒక పాపను బాత్రుంలో  తీసుకువెళ్లాడు అని చెప్పారు. దీంతో బాత్రూంలో వెళ్లి చూడగా రక్తపు మడుగులో పడి ఉన్న తన కూతురిని వెంటనే ఆసుపత్రికి తరలించింది. అప్పటికే బాలిక చనిపోయిందని వైద్యులు ఆమెకు తెలిపారు. బాలిక మృతి పై తల్లిదండ్రులు పోలీసులకు (Police) ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు బాలికకు పోస్టుమార్టం నిర్వహించారు.

పోలీసుల కథనం ప్రకారం: 

ఆదివారం సాయంత్రం  ఇంటి బయట ఆడుకుంటున్న బాలికను అదే ప్రాంతానికి చెందిన 14 ఏళ్ల యువకుడు  బాత్రూంలోకి తీసుకువెళ్లాడు.  మొదట  బాలిక పై లైంగిక దాడికి పాల్పడిన ఆ యువకుడు   బాలిక ప్రైవేట్ భాగలపై గోళ్లతో గిచ్చాడని  పోలీసులు తెలిపారు.అత్యాచారం అనంతరం బాలిక కేకలు వేయడంతో నిందితుడు ఆమె గొంతు కొరికి చంపినట్లు వెల్లడించారు..పోస్టుమార్టం నివేదికలో బాలిక అత్యాచారం గురైందని బిలస్ పూరు ఎస్పీ రాజ్ నేష్ సింగ్ వెల్లడించారు. నిందుతుడి పై వివిధ సెక్షన్లలో కేసు నమోదు చేసి కోర్టుకు హాజరు పరుస్తున్నామని తెలిపారు. అలాగే నిందితుడి మేనమామకు ఈ విషయాన్ని దాచి పెట్టడానికి ప్రయత్నించటంతో  అతనిపై కూడా కేసు నమోదు చేసినట్లు ఎస్పీ తెలిపారు.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Conistable case: మహిళా కానిస్టేబుల్ సూసైడ్‌లో బిగ్ ట్విస్ట్.. డైరీలో బయటపడ్డ సంచలనాలు!

పెళ్లి కావట్లేదని సూసైడ్ చేసుకున్న మహిళా కానిస్టేబుల్ నీల కేసులో సంచలనాలు బయటపడ్డాయి. ఆమె అనుమానస్పద మృతిపై RTV ఎక్స్‌క్లూజివ్ గ్రౌండ్ రిపోర్ట్ చేపట్టగా.. అధిక కట్నం ఇవ్వలేక, పేద ఇంట్లోకి వెళ్లలేక ఒత్తిడికి లోనై చనిపోయినట్లు వెలుగులోకి వచ్చింది.

New Update

Conistable case: పెళ్లి కావట్లేదని సూసైడ్ చేసుకున్నమహిళా కానిస్టేబుల్ నీల కేసులో సంచలనాలు బయటపడ్డాయి. జనగామ జిల్లాకు చెందిన నీల.. హన్మకొండ హెడ్‌క్వార్టర్స్‌లో AR కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. కాగా ఆమె అనుమానస్పద మృతిపై RTV ఎక్స్‌క్లూజివ్ గ్రౌండ్ రిపోర్ట్ చేపట్టగా మరికొన్ని అంశాలు వెలుగులోకి వచ్చాయి. పెళ్లి ఆలస్యానికి వరకట్నమే కారణంగా బయటయపడగా పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

స్థాయికి మించిన కట్నం..

జనగామ జిల్లా కొడకండ్ల మండలం నీలిబండ తండాకు చెందిన హేమ్‌లాల్‌, చియా దంపతుల మూడో సంతానం నీల. నీలకు సునీత, సురేష్‌, సోనియా అనే ముగ్గురు తోబుట్టువులున్నారు. అయితే తనకు ఉద్యోగం వచ్చిన తర్వాత పెళ్లి సంబంధాలు చూడటం మొదలుపెట్టింది నీల. ఈ క్రమంలోనే వచ్చిన సంబంధాల్లో ఎక్కువమంది వారి స్థాయికి మించిన కట్నం అడిగారు. నీల ఫ్యామిలీ ఇవ్వలేని స్థితిలో ఉంది. 

Also Read: మైనర్ బాలికకు గర్భం.. పోక్సో కేసులో ముంబై హైకోర్టు సంచలన తీర్పు!

బాధనంతా డైరీలో రాసుకుని.. 

మరోవైపు ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాపేద కుటుంబంలోకి వెళ్లలేక నీల మదనపడింది. ఉన్నతస్థాయి ఫ్యామిలీలకు కట్నం ఇవ్వలేక ఒత్తిడికి లోనైంది. తన పరిస్థితి ఏమిటంటూ తనలో తాను ఏడుస్తూ బాధనంతా డైరీలో రాసుకుంది. పెళ్లిపై తన కుటుంబం సరైన బాధ్యత తీసుకోలేదని కూడా మనస్థాపం చెందిన నీలిమ దారుణానికి పాల్పడింది. ఇక మరోవైపు నీల దండ్రి హేమ్ లాల్ మాత్రం తమకంటే ఆర్థిక స్థోమత తక్కువగా ఉన్న అబ్బాయిలు చూడటానికి వస్తే.. తమ బిడ్డకు ఉద్యోగం ఉన్నందున ఎదురుకట్నం ఇవ్వాలని డిమాండ్ చేశాడని తెలుస్తోంది. ఇది కూడా నీలను ఒత్తిడికి గురిచేసినట్లు సమాచారం.

Also Read: అయోధ్య రామాలయంపై కీలక నిర్ణయం.. చుట్టూ 4 కి.మీ. రక్షణ గోడ ఏర్పాటు !

 

 janagam | sucide | today telugu news

Advertisment
Advertisment
Advertisment