Komuram Bheem Asifabad:టార్చర్ పెడుతున్న ఈ ప్రిన్సిపల్ మాకొద్దు..రోడ్డెక్కిన విద్యార్థినులు!

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ గర్ల్స్ హాస్టల్ విద్యార్థినులు బుధవారం ఉదయం రోడ్డెక్కారు. టార్చర్ పెడుతున్న ఈ ప్రిన్సిపల్ మాకొద్దంటూ.. విద్యార్థినులు ఉదయం ఎనిమిది గంటలకు ఒక్కసారిగా మార్కెట్ ఏరియాలోని రోడ్లపై పరుగులు పెట్టారు. దీంతో ఏం జరుగుతోందో అర్థం కాక స్థానికులు హడలెత్తిపోయారు.

New Update
Komuram Bheem Asifabad:టార్చర్ పెడుతున్న ఈ ప్రిన్సిపల్ మాకొద్దు..రోడ్డెక్కిన విద్యార్థినులు!

Komuram Bheem Asifabad:కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ గర్ల్స్ హాస్టల్ విద్యార్థినులు బుధవారం ఉదయం రోడ్డెక్కారు. టార్చర్ పెడుతున్న ఈ ప్రిన్సిపల్ మాకొద్దంటూ.. విద్యార్థినులు ఉదయం ఎనిమిది గంటలకు ఒక్కసారిగా మార్కెట్ ఏరియాలోని రోడ్లపై పరుగులు పెట్టారు. దీంతో ఏం జరుగుతోందో అర్థం కాక స్థానికులు హడలెత్తిపోయారు.

ఇక వారందరూ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా దగ్గరికి చేరుకొని రోడ్డుపై బైఠాయించారు. అక్కడ దాదాపుగా గంట పాటు ప్రిన్సిపల్ కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో రోడ్డుకు ఇరువైపులా భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఇక వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని విద్యార్థినులను నచ్చచెప్పే ప్రయత్నం చేశారు.

మాకొద్దీ ప్రిన్సిపల్..!

అయితే టార్చర్ పెడుతున్న ప్రిన్సిపాల్ పై యాక్షన్ తీసుకోవాలని విద్యార్థినులు పట్టుబట్టి రోడ్డుపైనే కూర్చున్నారు. తరువాత అక్కడి నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయానికెళ్లి అక్కడ బైఠాయించారు. ప్రిన్సిపల్ ను సస్పెండ్ చేయాలని ఆందోళనకు దిగారు. ఉదయం నుంచి టిఫిన్ కూడా తినకుండా ఎండలోనే రోడ్డు పై కూర్చున్నారు.

హాస్టల్ ప్రిన్సిపల్ జ్యోతిలక్ష్మి తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోందని.. భోజనం కూడా మెను ప్రకారంగా పెట్టడం లేదని విద్యార్థినులు వా పోయారు. అనారోగ్యంతో విద్యార్థినులు బాధపడుతున్నా.. ఆమె పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్నామని.. కనీసం ఇంటికైనా పంపించమంటే పంపించకుండా టార్చర్ పెడుతుందని వారు ఆరోపించారు. వారంలో శుక్రవారం నుంచి మంగళవారం వరకు ప్రిన్సిపల్ హాస్టల్ కే రావడం లేదని.. ఆమెను వెంటనే సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు.

ఇది కూడా చదవండి.. సంగారెడ్డిలో పులి సంచారం.. ఆవు మెడను కొరికి చంపిన పులి!

https://rtvlive.com/tiger-roaming-in-sangareddy-the-tiger-bit-the-cows-neck-and-killed-it/

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Dilsukhnagar Bomb Blast : దిల్‌సుఖ్‌నగర్‌ బాంబు పేలుళ్ల కేసులో రేపు తెలంగాణ హైకోర్టు తీర్పు..

దిల్‌సుఖ్‌నగర్‌ బాంబు పేలుళ్లు కేసులో తెలంగాణ హైకోర్టు మంగళవారం కీలక తీర్పును వెలువరించనున్నది. 2013లో జరిగిన పేలుళ్లలో 18 మంది మృతి చెందారు. 130 మంది గాయపడ్డ విషయం తెలిసిందే. కాగా13 సంవత్సరాల విచారణ అనంతరం తీర్పు వెలువడనుండటంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

New Update
Telangana High Court

Telangana High Court

 దిల్‌సుఖ్‌నగర్‌ బాంబు పేలుళ్లు కేసులో తెలంగాణ హైకోర్టు మంగళవారం కీలక తీర్పును వెలువరించనున్నది. 2013లో జరిగిన పేలుళ్లలో 18 మంది మృతి చెందారు. 130 మంది గాయపడ్డ విషయం తెలిసిందే. కాగా13 సంవత్సరాల పాటు జరిగిన విచారణ అనంతరం రేపు తీర్పు వెలువడనుండటంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

ఇది కూడా చదవండి: Dia Mirza: HCU వివాదంపై రేవంత్ రెడ్డికి హీరోయిన్ కౌంటర్! అవి AI కాదు రియల్
 
Dilsukhnagar Bomb Blast | దిల్‌సుఖ్‌నగర్‌ బాంబు పేలుళ్లు కేసులో తెలంగాణ హైకోర్టు మంగళవారం కీలక తీర్పును వెలువరించనున్నది. 2013లో జరిగిన పేలుళ్లలో 18 మంది మృతి చెందారు. 130 మంది గాయపడ్డ విషయం తెలిసిందే. ఈ కేసును విచారించిన ఎన్‌ఐఏ ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు 2016లో మోస్ట్‌వాంటెడ్‌ ఉగ్రవాది యాసిన్‌ భత్కల్‌ సహా ఐదుగురికి మరణశిక్ష విధిస్తూ తీర్పును వెలువరించింది. అయితే, కేసులో ప్రధాన నిందితుడు రియాజ్‌ భత్కల్‌ ఇంకా పరారీలోనే ఉన్నాడు. అయితే, ఈ శిక్షను సవాల్‌ చేస్తూ నిందితులు హైకోర్టును ఆశ్రయించారు. నిందితుల పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు.. మంగళవారం తుది తీర్పు ఇవ్వనున్నది. కోర్టు ఎలాంటి తీర్పును వెలువరిస్తుందో తనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Also Read: చెయ్యి విరిగినా బుద్దిరాలే.. ట్రాఫిక్‌లో IPL మ్యాచ్ చూసినందుకు చుక్కలు కనబడ్డాయి- ఏం జరిగిందో తెలుసా?

21న ఫిబ్రవరి 2013లో దిల్‌సుఖ్‌నగర్‌ పేలుళ్లు సంభవించాయి. ఎన్‌ఐఏ రంగంలోకి దిగి విచారణ జరిపింది. విచారణలో 157 మంది సాక్ష్యాలను రికార్డు చేసింది. ఈ ఘటనలో ఇండియన్‌ ముజాహిద్‌ ఉగ్రసంస్థ సహ వ్యవస్థాపకుడు యాసిన్‌ భత్కల్‌ ప్రధాన నిందితుడిగా తేలింది. ఈ ఘటనలో అసదుల్లా అక్తర్‌, వకాస్‌, తెహసీన్‌ అక్తర్‌, ఎజాజ్‌ షేక్‌, సయ్యద్‌ మక్బూల్‌ని నిందితులుగా గుర్తించారు. మూడేళ్లు ఈ కేసులు విచారించిన ఎన్‌ఐఏ స్పెషల్‌ కోర్టు విచారణ తర్వాత నిందితులకు మరణశిక్షను విధిస్తూ తీర్పును వెలువరించింది. ఈ కేసులో కీలకంగా వ్యవహరించిన యాసిన్‌ భత్కల్‌ను 2013లో నేపాల్‌ సరిహద్దుల్లో పట్టుకున్నారు. ఢిల్లీ, దిల్‌సుఖ్‌నగర్‌ పేలుళ్ల కేసు సహా పలు కేసుల్లో దోషిగా తేలగా తిహార్‌ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు.

ఇది కూడా చదవండి: MLA Raja Singh : ఒవైసీ బ్రదర్స్‌ను కుక్కల బోనులో వేసి పాకిస్తాన్ పంపిస్తాం : ఎమ్మెల్యే రాజాసింగ్

Advertisment
Advertisment
Advertisment