ట్రాఫిక్ పై నెటిజన్ ట్వీట్ కు మంత్రి కేటీఆర్ రిప్లై ఇదే!

ప్రస్తుతం హైదరాబాద్లో వాహనదారులకు చుక్కలు కనిపిస్తున్నాయి. వర్షం పడిందంటే చాలు కిలో మీటర్ల మేర ట్రాఫిక్ జామ్.. ఇక గంటల పాటు ఆ ట్రాఫిక్ మధ్యే నరకాన్ని చూడాల్సి వస్తుంది. సమయానికి ఉద్యోగాలకు వెళ్లలేక...వెళ్లినా ఇంటికి రాలేక ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

New Update

This is Minister KTR's reply to the netizen's tweet on traffic!

సోమవారం సాయంత్రం కురిసిన కుంభవృష్టికి ఐటీ ఎంప్లాయిస్, స్టూడెంట్స్ ఆఫీసులు, కాలేజీల నుంచి ఇళ్లకు వెళ్లే టైమ్ కావడంతో సాయంత్రం ఐదున్నర నుంచి రాత్రి ఎనిమిదన్నర వరకు ఐటీ కారిడార్లోని అన్నీ మెయిన్ రోడ్స్ వెహికల్స్ తో నిండిపోయాయి. కి.మీ దూరానికి దాదాపు గంటకు పైగానే టైమ్ పట్టింది.

బయో డైవర్సిటీ నుంచి జేఎన్టీయూ వెళ్లే దారిలో, సైబర్ టవర్స్, గచ్చిబౌలీ, ఐఐఐటీ, విప్రో, లింగంపల్లి, నల్లగండ్ల, ఖాజాగూడ జంక్షన్ల దగ్గర ట్రాఫిక్ జామ్ అయింది. హైటెక్ సిటీ, నానక్ రాంగూడలోని ఐటీ ఎంప్లాయిస్ ఇళ్లకు చేరుకోవడానికి దాదాపుగా రెండు నుంచి మూడు గంటల సమయం పట్టింది.

దీంతో అక్కడి ట్రాఫిక్ జామ్ కు సంబంధించిన ఫోటోలు,వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే సోమవారం సాయంత్రం వేల సంఖ్యలో కార్లు ట్రాఫిక్ లో చిక్కుకున్నాయి. దీంతో ఆ ట్రాఫిక్ లో చిక్కుకున్న ఓ వ్యక్తి వీడియో తీసి ట్విట్టర్ లో మంత్రి కేటీఆర్ కు ట్యాగ్ చేసి.. ‘దయ చేసి శాశ్వత పరిష్కారం చూపండి’ అంటూ ట్వీట్ చేశాడు.

ఇక ఎప్పుడూ ట్విట్టర్ లో యాక్టివ్ గా ఉండే మంత్రి కేటీఆర్ వెంటనే స్పందిస్తూ.. వచ్చే కేబినెట్ లో హైదరాబాద్ మెట్రో రైలు పొడిగింపు అంశాన్ని ప్రధానంగా తీసుకున్నామని రిప్లై ఇచ్చారు. ఇప్పటికే ఈ సమస్యపై ముఖ్యమంత్రి కేసీఆర్ తమ శాఖను ఆదేశించారని, ప్రస్తుతం ఆ పనుల్లోనే ఉన్నామన్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు