అవి మొన్నటి వరకు పచ్చని పొలాలు.. కాని ఇప్పుడు ఇసుక మేటలు.. భారీ వర్షాలతో మిగిలింది అన్నదాతల కన్నీటి వ్యధలే!!

ప్రకృతి కన్నెర్ర..అన్నదాతలకు కన్నీళ్లే మిగిల్చింది. కన్నీటి వ్యధలు తప్పా.. కంటి ముందు వారికి ఏం కనిపించడం లేదు. మొన్నటి వరకు పచ్చని పైరుతో కళకళలాడిన పొలాలు ఇప్పుడు ఇసుక మేటలయ్యాయి. భారీ వర్షాలకు పొలం నిండా ఇసుక దిబ్బలే నిండుకున్నాయి. దీంతో ఏం చేయాలో..అన్నదాతకు దిక్కుతోచడం లేదు..! దీంతో వేలాది ఎకరాల్లో ఖరీఫ్ వరి సాగు ప్రశ్నార్థకంగా మారింది...

New Update
అవి మొన్నటి వరకు పచ్చని పొలాలు.. కాని ఇప్పుడు ఇసుక మేటలు.. భారీ వర్షాలతో మిగిలింది అన్నదాతల కన్నీటి వ్యధలే!!

ప్రకృతి కన్నెర్ర..అన్నదాతలకు కన్నీళ్లే మిగిల్చింది. కన్నీటి వ్యధలు తప్పా.. కంటి ముందు వారికి ఏం కనిపించడం లేదు. మొన్నటి వరకు పచ్చని పైరుతో కళకళలాడిన పొలాలు ఇప్పుడు ఇసుక మేటలయ్యాయి. భారీ వర్షాలకు పొలం నిండా ఇసుక దిబ్బలే నిండుకున్నాయి. దీంతో ఏం చేయాలో..అన్నదాతకు దిక్కుతోచడం లేదు. నారు వేసే విధంగా పొలాలు ఎప్పుడు మారుతాయన్నది వారి ఆవేదనగా మారింది. దీంతో ఇసుకతో నిండిన పొలాలు సాగులోకి తెచ్చేదెలా.. అని రైతులు తలలు పట్టుకుంటున్నారు.

2500 ఎకరాల్లో ఇసుక దిబ్బలే..

ఎడతెరిపి లేకుండా వారం రోజుల పాటు కురిసిన భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లాయి. గోదావరి, మానేరు నదులు పొంగి పొర్లడంతో తీర ప్రాంత సాగు భూములను వరదలు ముంచెత్తాయి. దీంతో వేలాది ఎకరాల్లో ఇసుక మేటలు నిండిపోయాయి. పొలాల గట్లు చిన్నాభిన్నమయ్యాయి. ఒక్క మంథని మండలంలోనే దాదాపుగా 800 ఎకరాల్లో ఇలా పొలాలు నాశనమైనట్టు అధికారులు గుర్తించారు. మంథని మండలంలో ఖాన్ సాయి పేట, ఖానాపూర్, ఆరెంద, వెంకటాపురం, నాగేపల్లి, అడవిసోమనపల్లి,చిన్నా ఓదాల , పెద్దల ఓదాలలో పూర్తిగా పొలాలు పనికి రాకుండాపోయాయి.అదే విధంగా ముత్తారం మండలంలో ఒడేడు, అడవి శ్రీరాంపూర్, ఖమ్మంపల్లి, శాత్రాజుపల్లి ప్రాంతాల్లో కూడా అదే పరిస్థితి నెలకొనడంతో రైతులు తలలు పట్టుకుంటున్నారు.

చెక్ డ్యామ్ లు, క్వారీలే కారణం..

క్షేత్రస్థాయిలో పరిశీలించిన వ్యవసాయ అధికారులు 1700 ఎకరాలలో ఇసుక మేటలున్నట్టు అంచనా వేశారు.అయితే గోదావరి తీర ప్రాంతాల కంటే కూడా.. మానేరు నదీ పరివాహక ప్రాంతాల్లోనే పొలాల్లో అధికంగా నష్టం జరిగింది. దీనికి కారణం చెక్ డ్యామ్ లు. వీటి వల్ల ప్రవాహం సాఫీగా సాగుకుండా వరద అంతా పొలాలను ముంచెత్తింది. అదే విధంగా ఇసుక క్వారీల వల్ల నష్టం మరింత ఎక్కువైందని అన్నదాతలు బోరుమంటున్నారు. క్వారీల దగ్గర నిల్వ చేసిన ఇసుక పొలాల్లోకి చేరిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ప్రభుత్వమే ఆదుకోవాలి ఇప్పుడు..

గతేడాది జూలై లో కురిసిన భారీ వర్షాలకే గోదావరి, మానేరు పరివాహక ప్రాంతాల్లోని పొలాలు ఘోరంగా దెబ్బ తిన్నాయి.ఇసుక మేటలు వేయడంతో పనికి రాకుండాపోయాయి. అప్పుడు 2200 ఎకరాల్లో పొలాలు దెబ్బతిన్నట్టు వ్యవసాయ అధికారులు లెక్కలు వేశారు. ప్రభుత్వానికి నివేదికలు ఇచ్చారు. అయితే అదంతా పరిశీలన వరకే ఉండిపోయింది. అన్నదాతలకు నయా పైసా సహాయం అందలేదు. దీని నుంచి కోలుకోక ముందే ఈ ఏడాది కూడా రైతులకు మరో దెబ్బ పడింది.

పొలాలన్నీ ఇసుక కుప్పలవ్వడంతో వాటిని తొలగించడానికి 50 వేల నుంచి లక్ష వరకు ఖర్చు అవుతోందని..అదే విధంగా వరద తీవ్రతతో కోతకు గురైన పొలాలను పునరుద్ధరించడం కూడా ఖర్చుతో కూడుకున్నదే. దీంతో పొలాల్లో ఉన్న ఇసుక మేటలను అమ్ముకోవడానికి ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చినా.. ఇంకా ఆర్థిక భారం పడుతుందని.. అందుకే ప్రభుత్వం వెంటనే ముందుకు వచ్చి ఈ పరిస్థితుల్లో తమను ఆదుకోవాలని వారు కోరుతున్నారు. లేక పోతే.. వేలాది ఎకరాల్లో ఖరీఫ్ వరి సాగు ప్రశ్నార్థకంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు