DK Aruna:బీఅర్ఎస్ అనౌన్స్ చేసిన అభ్యర్థుల మీద అనేక ఆరోపణలున్నాయి: డీకే అరుణ చట్ట సభల్లో 33% మహిళ రిజర్వేషన్ కావాలని ఢిల్లీలో కవిత దొంగ దీక్ష చేసారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాల డీకే. అరుణ అన్నారు. ఇక లిక్కర్ కేసును దారి మళ్లించేందుకే కవిత దీక్ష చేశారని ఆమె విమర్శించారు ఇక బీఅర్ఎస్ అనౌన్స్ చేసిన అభ్యర్థుల మీద అనేక ఆరోపణలు ఉన్నాయన్నారు.ఆయినా ఎమ్మెల్యే అభ్యర్థులుగా కేసిఆర్ వాళ్లను ప్రకటించారన్నారు. ఎస్సీ ఎస్టీ ల రిజర్వేషన్ కు చెందిన ఐదు సీట్లను మాత్రమే మార్చి.. మిగతా వారిని కంటిన్యూ చేసారన్నారు... By P. Sonika Chandra 22 Aug 2023 in రాజకీయాలు New Update షేర్ చేయండి DK Aruna:చట్ట సభల్లో 33% మహిళ రిజర్వేషన్ కావాలని ఢిల్లీలో కవిత దొంగ దీక్ష చేసారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాల డీకే. అరుణ అన్నారు. ఇక లిక్కర్ కేసును దారి మళ్లించేందుకే కవిత దీక్ష చేశారని ఆమె విమర్శించారు. తెలంగాణలో 33% సీట్లు మహిళలకు ఇవ్వనందుకు మీ నాన్న కేసీఆర్ ను ఎందుకు అడగట్లేదని అరుణ నిలదీశారు. మహిళ బిల్లును చించేసిన పార్టీలతో కలిసి వెళ్లిన కవిత కేసిఆర్ కు బిడ్డ తప్ప ఆమెలో ఇంకే మహిళ కనిపించదన్నారు ఆమె. ఇక రక్షణ శాఖ, విదేశీ వ్యవహారాల శాఖను మహిళలకు ఇచ్చిన ఘనత మోడీ ది అన్నారు డీకే. అరుణ. కీలకమైన ఆర్థిక శాఖ మహిళ కు కేటాయించింది మోడీ సర్కారే అన్నారు. ఆదివాసీ మహిళను రాష్ట్రపతి గా పెడితే బీఅర్ఎస్ ఆమెకు వ్యతిరేకంగా ఓటింగ్ కు పాల్పడిందన్నారు ఆమె. మహిళల మీద నగరం నడిబొడ్డున అనేక అకృత్యాలు జరిగినా సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి ఏ అధికారి మాట్లాడలేదన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్న అధికారులందరికీ రాజకీయ పిచ్చి పట్టుకుందన్నారు. సీఎం కాళ్ళు మొక్కి ఐఏఎస్ ల గౌరవం తీస్తున్న ఆఫీసర్స్ రాజకీయాలపై ఇంటరెస్ట్ ఉన్న అధికారులు ఎవరైనా కాని రాజీనామా చేసి రాజకీయాల్లో రావాలన్నారు డీకే అరుణ. ఏ పథకం ఇచ్చిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు, నేతలకే ఇవ్వాలని అధికారులు అదేశాలు ఇస్తున్నారన్నారు. ఇక ప్రజా సేవ కంటే డబ్బు సంపాదనే ముఖ్యమనే భావన ఎమ్మెల్యే లో తీసుకొచ్చిన ఘనత కేసిఆర్ దే అని విమర్శించారు. ఎకరం 100 కోట్లు పలికింది అంటున్నారు.. సామాన్యుడు దాన్ని కొనగలడా? కార్పొరేట్ కంపెనీలతో కుమ్మకై భూములు వారికే కట్టబెట్టి దోచుకుంటున్నారని డీకే అరుణ అన్నారు. ఖరీదైన భూములను పార్టీ ఆఫీసుల పేరు మీద తక్కువకు కొట్టేశారన్నారు. ప్రజాధనం లూటీ చేసి ప్రభుత్వ ఖజానా నింపుకునేందుకే ముందస్తు మద్యం టెండర్లు తీసుకొచ్చారని ఆమె ఫైర్ అయ్యారు. మద్యం మీద ఉన్న శ్రద్ద విద్య మీద ఎందుకు లేదని ఆమె ప్రశ్నించారు. ఉద్యోగ నోటిఫికేషన్స్ ఇవ్వట్లేదన్నారు. ఇచ్చిన వాటిలో పేపర్ లీకేజి చేస్తున్నారని ఆమె విమర్శించారు. కేసిఆర్ కు ఓటు అడిగే హక్కు లేదన్నారు. దళిత బంధును 5 మంది కార్యకర్తలు పంచుకుంటున్నారన్నారని ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు. డిసెంబర్ లో ఎన్నికలు జరుగుతాయన్నారు. అయితే బీఅర్ఎస్ అనౌన్స్ చేసిన అభ్యర్థుల మీద అనేక ఆరోపణలు ఉన్నాయన్నారు. ఆయినా ఎమ్మెల్యే అభ్యర్థులుగా కేసిఆర్ వాళ్లను ప్రకటించారన్నారు. ఎస్సీ ఎస్టీ ల రిజర్వేషన్ కు చెందిన ఐదు సీట్లను మాత్రమే మార్చి.. మిగతా వారిని కంటిన్యూ చేసారన్నారు. ప్రభుత్వ సొమ్ముతో ఓట్లు కొనేందుకు చూస్తున్నారని ఆమె ఆరోపించారు. బీసీ లకు 22సీట్లు మాత్రమే ఇచ్చారన్నారు. బీసీ లో అత్యధిక జనాభా ఉన్న ముదిరాజ్ వర్గానికి ఒక్క సీటు కూడా ఇవ్వలేదన్నారు. అభ్యర్థిని చూసి కాకుండా కేసిఆర్ ను చూసే ఓటు వేయాలనే ధోరణిలో కేసీఆర్ ఉన్నారని ఆమె కామెంట్స్ చేశారు. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి