దుబ్బాక - గంగమ్మ గుడి వద్ద మద్యం మత్తులో నలుగురు యువకులు వీరంగం సృష్టించారు. కారును ఆపి అందులో ఉన్న విష్ణు, మహమ్మద్ రషీద్ అనే ఇద్దరు యువకులపై దాడి చేసి, కారును ద్వంసం చేశారు. పాత కక్షల కారణంగా దాడి చేసినట్టు గుర్తించి పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.
బెంగళూర్‌లో మరో దారుణం జరిగింది. మైనర్ బాలికపై బ్యాడ్మింటన్ కోచ్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. అలాగే BGLRలో 8మంది ట్రైనీ అమ్మాయిల న్యూడ్ ఫొటోలు తీసినట్లు గుర్తించిన పోలీసులు తమిళనాడుకు చెందిన సురేశ్ బాలాజీని అరెస్ట్ చేశారు.
Rape case: బెంగళూర్‌లో మరో దారుణం జరిగింది. మైనర్ బాలికపై బ్యాడ్మింటన్ కోచ్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. BGLRలో 8మంది ట్రైనీ అమ్మాయిల న్యూడ్ ఫొటోలు తీసినట్లు గుర్తించి పోలీసులు సురేశ్ బాలాజీని అరెస్ట్ చేశారు.
ట్రైనీల న్యూడ్ ఫొటోలు..
ఈ మేరకు తమిళనాడుకు చెందిన 26 ఏళ్ల సురేశ్ BGLRలో కోచింగ్ సెంటర్ లో బాడ్మింటన్ కోచ్ గా పనిచేస్తున్నాడు. అయితే 16 ఏళ్ల బాలిక రెండేళ్ల క్రితం ట్రైనీగా చేరింది. ఆమెను బలవంతంగా లోబరుచుకుని పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఎవరికీ చెప్పొద్దని బెదిరించినట్లు బాధితురాలు ఫిర్యాదు చేయడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. అతని ఫోన్లో మరో 8మంది ట్రైనీల న్యూడ్ ఫొటోలు ఉన్నట్లు గుర్తించారు. ఈ బాలికతోపాటు మరికొంతమంది అమ్మాయిలను కూడా అత్యాచారం చేసినట్లు ఆరోపణలు వస్తుండటం సంచలనం రేపుతోంది.
అయితే బాలిక అమ్మమ్మ ఫోన్ చెక్ చేయడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. కోచ్ తరచుగా బాలికను ఇంటికి తీసుకెళ్లి అత్యాచారం చేసినట్లు బయటపడింది. కోచ్ సురేష్‌తో చేసిన చాటింగ్‌లో బాలిక తన న్యూడ్ పిక్స్‌ను అతనికి పంపినట్లు గుర్తించారు. ఈ విషయాన్ని బాలిక తల్లిదండ్రులకు చెప్పడంతో వారు ఆమెను నిలదియగా అసలు విషయం బయటపెట్టింది. కానీ బాలిక మాత్రం కోచ్ సురేష్‌తో తానే అక్రమం సంబంధం పెట్టుకున్నట్లు చెప్పడంతో కేసు మరింత సంచలనంగా మారింది.