AP: ఫారెస్ట్ ఆఫీసును ముట్టడించిన గిరిజనులు..!

విజయనగరంలో గిరిజనులు ఫారెస్ట్ ఆఫీసును ముట్టడించారు. తాము సాగు చేస్తున్న భూమికి పోడు పట్టాలు ఇంతవరకు ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గిరి శిఖరాల్లో ఉన్న గిరిజన గ్రామాలకి కనీసం మౌలిక సదుపాయాలు లేవని మండిపడుతున్నారు.

New Update
AP: ఫారెస్ట్ ఆఫీసును ముట్టడించిన గిరిజనులు..!

Vizianagaram: విజయనగరంలో గిరిజనులు ఫారెస్ట్ ఆఫీసును (Forest Office) ముట్టడించారు. ఎన్నో ఏళ్ల నుండి అడవిపైన ఆధారపడి తమ జీవనం కొనసాగుతుందని..తాము సాగు చేస్తున్న భూమికి పోడు పట్టాలు ఇంతవరకు ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గిరి శిఖరాల్లో ఉన్న గిరిజన గ్రామాలకి కనీసం మౌలిక సదుపాయాలు ఉండటం లేవని మండిపడుతున్నారు. బొబ్బిలి పరిసర ప్రాంతాల్లో ఉన్న గిరిజన గ్రామాలకు కరెంటు కోసం 400 స్తంభాలను విద్యుత్ అధికారులు వేసినప్పటికీ ఫారెస్ట్ అధికారులు నిరాకరించారన్నారు.

గిరిజన అభివృద్ధిని ఫారెస్ట్ అధికారులు అడ్డుకుంటున్నారని ఫైర్ అవుతున్నారు. తమ సమస్యలను కలెక్టర్ కి విన్నవించుకుంటే ఫారెస్ట్ అధికారి దగ్గరకి వెళ్లమంటున్నారని.. ఫారెస్ట్ అధికారికి విన్నవిస్తే కలెక్టర్ దగ్గరి వెళ్లమంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యలు ఎవరితో చెప్పుకోవాలని తెలియడం లేదని వాపోయారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తమను ఆదుకోవాలని భూమికి పోడు పట్టాలు ఇచ్చి.. మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

Also Read: మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం సిబ్బందిపై స్పెషల్ ఫోకస్.. వారి మొబైల్ ఫోన్ లను స్వాధీనం చేసుకుని..

Advertisment
Advertisment
తాజా కథనాలు