మనిషి రోజుకి 5సార్లు అన్ కంఫర్టబుల్ గా ఫీలవుతున్నాడు..యూఎస్ సర్వే వెల్లడి.!

మనిషి ప్రతి రోజు ఐదు సార్లు అన్ కంఫర్టబుల్ గా ఫీలవుతున్నాడట.యూఎస్ కేంద్రంగా రెండువేల మందిపై కురాడ్ అండ్ వన్‌పోల్ సంస్థలు ఉమ్మడి సర్వే వెల్లడించింది. పెద్ద సమూహంలో ఉన్నప్పుడు 40 శాతం మంది, పనులు పూర్తికాకపోవడంవల్ల 34 శాతం, కొత్త ఉద్యోగంలో సెట్ అయ్యేప్పుడు 28 శాతం మంది, ఫస్ట్‌ టైమ్ డేటింగ్ యాప్‌ని ప్రయత్నించే సందర్భంలో 27 శాతం మంది. మీటింగ్‌కు అందరికంటే లేటుగా అటెండ్ అయ్యేవారిలో 22 శాతం మంది అసౌకర్యంగా ఫీలవుతున్నట్లు సర్వే పేర్కొన్నది.

New Update
మనిషి రోజుకి 5సార్లు అన్ కంఫర్టబుల్ గా  ఫీలవుతున్నాడు..యూఎస్ సర్వే వెల్లడి.!

మనిషి ఎటో కొట్టుకుపోతున్నాడు.దేని కోసమో వెంపర్లాడుతున్నాడు. అది దక్కకపోతే కుంగిపోతున్నాడు. దేశమేదైతేనేమి..ఈ వ్యవస్థ, వృత్తి,జీవన రీతి,భవిష్యత్తు, నమ్మకాలు, భయాలు,పరిస్థితులు ఒకటేమిటి అన్నిటికి మనిషి ఒక టార్గెట్ అయిపోయాడు.

publive-image

ఇప్పటి మనిషిని అర్థం చేసుకోకుంటే, రేపటి మనిషి మరింత ఇబ్బంది పడక తప్పదు. మీకు తెలుసా..!? ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు సగటు వ్యక్తి రోజుకు ఐదుసార్లు అసౌకర్యంగా ఫీలవుతున్నాడట.! యూఎస్ కేంద్రంగా రెండువేల మందిపై కురాడ్ అండ్ వన్‌పోల్ సంస్థలు ఉమ్మడిగా నిర్వహించి ఒక సర్వే ఈ విషయాన్ని వెల్లడించింది.

పలువురి కాన్ఫిడెంట్ లెవల్స్‌ ను పరిశీలించిన నిపుణులు చాలామంది కొన్ని విషయాల్లో తమను తాము వెంటనే విశ్వసించడానికి కష్టపడుతున్నారని తెలిపారు. ఒక పెద్ద సమూహంలో ఉన్నప్పుడు 40 శాతం మంది, ఆయా పనులకోసం సరిగ్గా సిద్ధం కాకపోవడంవల్ల 34 శాతం, కొత్త ఉద్యోగాన్ని ప్రారంభించడంలో 28 శాతం మంది ఇన్‌సెక్యూర్‌గా ఫీలవుతున్నారు.

ఫస్ట్‌ టైమ్ కొత్త డేటింగ్ యాప్‌ని ప్రయత్నించే సందర్భంలో 27 శాతం మంది. మీటింగ్‌కు అందరికంటే లేటుగా అటెండ్ అయ్యేవారిలో 22 శాతం మంది అసౌకర్యంగా ఫీలవుతున్నట్లు సర్వే పేర్కొన్నది.

అయితే ప్రజలు తమ జీవితంలో అసౌకర్యంగా భావించే పరిస్థితులను తగ్గించుకోవడం తమ చేతిలో లేదని చెప్తున్నప్పటికీ, కొన్ని టిప్స్ ఫాలో అవడం, సొంత ఉపాయాలతో ఆత్మ విశ్వాసాన్ని తిరిగి పొందడం, అసౌకర్యాన్ని ఎదుర్కోవడం చేస్తున్నారు.

48 శాతం మంది పాజిటివ్ మైండ్ సెట్‌ను అడాప్ట్ చేసుకోవడం ద్వారా అన్‌కంఫ్టబుల్‌ను అధిగమిస్తున్నారు. 46 శాతం మంది ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ సపోర్ట్‌తో ఇబ్బందికర పరిస్థితులను అధిగమిస్తున్నారు. ఇక ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సిద్ధపడటంతో 43 శాతం మంది ఆత్మ విశ్వాసాన్ని పొందగలుగుతున్నారు.

అనుకున్న వర్క్ టాస్కులను పూర్తి చేయడంవల్ల 39 శాతం మంది, వివిధ సందర్భాల్లో ఇతరులకు హెల్ప్ చేయడంవల్ల 31 శాతం మంది తమ కాన్ఫిడెంట్ లెవల్స్‌ను తిరిగి పొందుతున్నారని సర్వేను ఎనలైజ్ చేసిన నిపుణులు వెల్లడించారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు