Nehru Letter: స్వాతంత్య్రం వచ్చినపుడు నెహ్రూ ఆ పని చేయాలనుకున్నారా.. చర్చ లేపుతున్న X పోస్ట్!

మన దేశ ప్రథమ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ లెటర్ ఒకటి సోషల్ మీడియా X లో షేర్ చేశారు ఒక యూజర్. దాని ప్రకారం స్వాతంత్య్రం వచ్చిన సమయంలో మనదేశ జెండాతో పాటు బ్రిటీష్ యూనియన్ జాక్‌ను కూడా ఎగురవేయాలని నెహ్రూ అనుకున్నరు. అదేవిషయాన్ని మౌంట్‌బాటన్‌కు చెబుతూ లెటర్ రాశారు. 

New Update
Nehru Letter: స్వాతంత్య్రం వచ్చినపుడు నెహ్రూ ఆ పని చేయాలనుకున్నారా.. చర్చ లేపుతున్న X పోస్ట్!

Nehru Letter: ఒక్కోసారి సోషల్ మీడియాలో కొన్ని పోస్ట్స్ ఆశ్చర్యానికి గురిచేస్తాయి. తరువాత అవి వివాదాస్పదం కూడా కావచ్చు. అటువంటిదే X లో వచ్చిన ఒక పోస్ట్ పై చర్చ మొదలైంది. మన దేశ ప్రధమ ప్రధాని జవహర్ లాల్ నెహ్రు స్వాతంత్య్రం వచ్చిన సమయంలో ఇంగ్లాండ్ అధికారి మౌంట్‌బాటన్‌కు రాసిన  ఒక లేఖలోని అంశాలు ఈ ట్వీట్ లో ఉన్నాయి.

దీనిలో ఒక ఇమేజ్ షేర్ చేస్తూ దానికి శీర్షికగా “నెహ్రూ త్రివర్ణ పతాకంతో పాటు బ్రిటీష్ యూనియన్ జాక్‌ను 15 ఆగష్టు 1947న ఎగురవేయాలని అనుకున్నారు.  ~ 1947 ఆగస్టు 10న నెహ్రూ మౌంట్‌బాటన్‌కు రాసిన లేఖలో ఈ విషయం ఉంది” అని ఇచ్చారు. అంటే, మనకు స్వాతంత్య్రం వచ్చినపుడు.. భారతీయ జెండాతో పాటు, బ్రిటీషర్ల జెండా కూడా ఎగురవేయాలని నెహ్రు అనుకున్నారనీ, దానికోసం మౌంట్‌బాటన్‌కు అనుమతి కోరుతూ లేఖ రాశారనీ తెలుస్తోంది. ఈ ట్వీట్ లో పొందుపరిచిన ఫొటోలో ఉన్న నెహ్రూ రాసిన లెటర్ లో భాగంగా చెబుతున్న దీనిని ఇందిరాగాంధీ ప్రభత్వ హయాంలో ఏర్పాటు చేసిన "సెలెక్టెడ్ వర్క్స్ ఆఫ్ నెహ్రూ" (S2) నుంచి సేకరించినదిగా ఆ పోస్ట్ లో పేర్కొన్నారు. 

ఆ ట్వీట్ ను ఇక్కడ మీరు కూడా చూడవచ్చు. 

ఇది అవసరమా?
సోషల్ మీడియా ప్రాబల్యం పెరిగిన తరువాత ఇలా పాత అంశాల మీద చర్చలు రేపడం ఎక్కువగా అయిపొయింది. నిజానికి జాతీయ నాయకుల పై ఇటువంటి చర్చ జరగడం అనేది మంచి పద్ధతి కాదు అని పలువురు నెటిజన్లు రిప్లై ఇచ్చారు. దీనికి సంబంధించిన సోర్స్ ఏమిటని కూడా కొందరు ప్రశ్నించారు. అంతేకాకుండా, ఎవరికి వారు ఎవరి ఇష్టం వచ్చినట్టుగా వారు సున్నితమైన అంశాలను సోషల్ మీడియా వేదికగా రేపుతుండడం ఆందోళన రేపుతోంది. అప్పట్లో ఏమి జరిగింది.. అనేది పూర్తిగా ఎవరికీ తెలీదు. ఎక్కడో ఎదో దొరికిన ఒక చిన్న లెటర్ ముక్క పట్టుకుని జాతీయనాయకుల వ్యక్తిత్వాన్నే ప్రశ్నిస్తున్నట్టుగా.. వారిని అల్లరి చేస్తున్నట్టుగా సోషల్ మీడియాలో ఇలా పోస్టులు పెట్టడం సరైన విధానం కాదనేది అందరి అభిప్రాయం

Also Read : సముద్రంలో పడవ బోల్తా.. ఆరుగురు మత్సకారులు!

#jawahar-lal-nehru
Advertisment
Advertisment
తాజా కథనాలు