శభాష్ .. ఆక్సిజన్ సిలిండర్ తో పోలింగ్ కేంద్రానికి వచ్చిన శేషయ్య.!

ఆక్సిజన్ సిలిండర్ తో ఒక వ్యక్తి పోలింగ్ కేంద్రానికి వచ్చి అందరికి ఆదర్శంగా నిలిచారు. హైదరాబాద్ గచ్చిబౌలికి చెందిన 75 ఏళ్ల శేషయ్య లివర్ సిరోసిస్ తో బాధపడుతున్నారు. తీవ్ర అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నా ఓటు హక్కు వినియోగించుకున్నారు.

New Update
శభాష్ .. ఆక్సిజన్ సిలిండర్ తో పోలింగ్ కేంద్రానికి వచ్చిన శేషయ్య.!

Telangana Elections 2023: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. పోలింగ్ లో యువతి యువకులు, పెద్దలు, మహిళలు, వృద్ధులు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. అంతేకాదు అనారోగ్యంతో బాధ పడుతున్న వారు సైతం వచ్చి ఓటేసి అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు.

Also read: రికార్డు దిశగా తెలంగాణ పోలింగ్.. ఇప్పటి వరకు 44 శాతం ఓటింగ్!

హైదరాబాద్ లోని గచ్చిబౌలికి చెందిన 75 ఏళ్ల శేషయ్య లివర్ సిరోసిస్ తో బాధపడుతున్నారు. ఓటు వేయడానికి ఏకంగా ఆక్సిజన్ సిలిండర్ తో పోలింగ్ కేంద్రానికి వచ్చారు. గచ్చిబౌలి జీపీఆర్ఏ క్వార్టర్స్ పోలింగ్ కేంద్రంలో శేషయ్య ఓటు వేశారు. ఓటు వేయడం పౌరుడిగా తన బాధ్యత అని 1966 నుంచి తాను మిస్ అవ్వకుండా ఓటు వేస్తున్నానని చెప్పారు శేషయ్య. అనారోగ్యంతో బాధపడుతున్నా ఏ మాత్రం లెక్కచేయకుండా శేషయ్య తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రస్తుతం శేషయ్య ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇది చూసిన నెటిజన్లు ఆయన పై హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వారిని స్ఫూర్తిగా తీసుకుని అంతా ఓటు వేసేందుకు కదలిరావాలని అంటున్నారు.

Also Read: అర్బన్ ఓటర్ల నిర్లక్ష్యంపై వికాస్ రాజ్ కీలక వ్యాఖ్యలు.. ఏమన్నారంటే

కాగా, తెలంగాణ అసెంబ్లీ పోలింగ్ ప్రక్రియ సాయంత్రం 5 గంటలకు ముగియనుంది. ఆ సమయానికి పోలింగ్ బూత్ వద్దకు చేరుకున్న ఓటర్లను మాత్రం ఓటు వేయడానికి అనుమతిస్తారు. ఆ తర్వాత వచ్చే వారికి ఓటు వేసే అవకాశం ఉండదు. మరోవైపు ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటర్లు మొగ్గు చూపుతున్నారు, ఎవరు గెలవబోతున్నారనే ఉత్కంఠ అందరిలో నెలకొంది. ఎగ్జిట్ పోల్స్ వెలువడితే కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు