Jammu Encounter: జమ్మూలో కొనసాగుతున్న ఉగ్రవాదుల వేట

జమ్మూ కశ్మీర్లో ఇద్దరు ఆర్మీ, ఓ పోలీసు అధికారిని పొట్టనబెట్టుకున్న ఉగ్రవాదుల కోసం వేట కొనసాగుతూనే ఉంది. అనంతనాగ్ జిల్లాలో మంగళవారం మొదలైన జాయింట్ ఆపరేషన్ ఇప్పటికీ ముగియలేదు. ఇరు వర్గాల మధ్య భీకర పోరు కొనసాగుతోంది. ఈ ఆపరేషన్ లో ఆర్మీ, జమ్మూకశ్మీర్ పోలీస్, సీఆర్పీఎఫ్ బలగాలు పాల్గొంటున్నాయి.

New Update
Encounter: జమ్ముకశ్మీర్‌ లో ఉగ్రవాదుల కాల్పులు..నలుగురు సైనికులు మృతి!

Jammu Encounter: జమ్మూ కశ్మీర్లో ఇద్దరు ఆర్మీ, ఓ పోలీసు అధికారిని పొట్టనబెట్టుకున్న ఉగ్రవాదుల కోసం వేట కొనసాగుతూనే ఉంది. అనంతనాగ్ జిల్లాలో మంగళవారం మొదలైన జాయింట్ ఆపరేషన్ ఇప్పటికీ ముగియలేదు. ఇరు వర్గాల మధ్య భీకర పోరు కొనసాగుతోంది. ఈ ఆపరేషన్ లో ఆర్మీ, జమ్మూకశ్మీర్ పోలీస్, సీఆర్పీఎఫ్ బలగాలు పాల్గొంటున్నాయి. ఈ ఎన్ కౌంటర్ లో ఇప్పటివరకు ముగ్గురు అధికారులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు జవాన్లు గాయపడ్డారు. ఒకరు కనిపించకుండా పోయారు. గాయాలతో ఒక జవాను మరణించాడు. ఎన్ కౌంటర్ జరుగుతున్న ప్రదేశం నుంచి పెద్ద ఎత్తున కాల్పులు, బాంబులు పేలిన శబ్దాలు వినిపిస్తున్నాయి.

ముగ్గురు లష్కరే తోయిబా ఉగ్రవాదులు భారీగా ఆయుధాలు, పేలుడు పదార్ధాలతో భద్రతా బలగాలపై కాల్పులు జరుపుతున్నారు. వారిలో స్థానిక కమాండ్ ఉజైర్ ఖాన్ కూడా ఉన్నాడు. ఉజైర్ ఖాన్ గత సంవత్సరమే ఈ ఉగ్ర సంస్థలో చేరాడు. స్థానికుడు కావడంతో అతడికి ఆ అడవిలో అణువణువు తెలుసు. దాంతో, వారిని మట్టుపెట్టడం భద్రతా బలగాలకు సమస్యగా మారింది. అయితే, ఉగ్రవాదులను భద్రతాదళాలు చుట్టుముట్టాయని, అతి త్వరలోనే వారిని మట్టు పెడ్తాయని పోలీసులు తెలిపారు. మరోవైపు మరణించిన కల్నల్ మన్ ప్రీత్ సింగ్, మేజర్ ఆశిష్ ధ్యాంచెక్ మృతదేహాలను పానిపట్ కు తరలించారు. డీఎస్పీ హుమయూన్ భట్ కు బుద్గాంలో అంత్యక్రియలు నిర్వహించారు.

ఉగ్రవాదులు ఉన్నారన్న పక్కా సమాచారంతో కశ్మీర్ పోలీసులు, ఆర్మీ అనంత్ నాగ్ జిల్లా గడోలె అటవీ ప్రాంతంలో గాలింపు చేపట్టాయి. వారికి ఉగ్రవాదుల నుంచి పెద్ద ఎత్తున ఎదురు దాడి ప్రారంభమైంది. ఉగ్రవాదులను మట్టుబెట్టడానికి సైన్యం అత్యాధునిక ఆయుధాలను వినియోగిస్తోంది. డ్రోన్లతో బాంబులను విడుస్తోంది. దట్టమైన అడవిలో నక్కిన ఉగ్రవాదులను ఏరివేసే లక్ష్యంతో ఈ ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ ఆపరేషన్‌లో, చినార్ కార్ప్స్ జనరల్-ఆఫీసర్-కమాండింగ్ (GOC), లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్, విక్టర్ ఫోర్స్ యొక్క GOC, మేజర్ జనరల్ బల్బీర్ సింగ్ ఆపరేషన్‌ను నిశితంగా పర్యవేక్షిస్తున్నారు. ఉగ్రవాదులను మట్టుబెట్టడం ఖాయమని తెలిపారు.

ఇది కూడా చదవండి: జమ్మూలో భారీ ఎన్‌కౌంటర్‌..ఇద్దరు జవాన్లకు గాయాలు..!!

Advertisment
Advertisment
తాజా కథనాలు