NIMS:తెలంగాణలో అమలు చేస్తున్న ఆరోగ్య పథకాలు బాగున్నాయి..నెదర్లాండ్ హెల్త్ మినిస్టర్!! హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రిని నెదర్లాండ్ వైద్యుల బృందం సందర్శించింది. తెలంగాణలో నిమ్స్ ఆసుపత్రి ప్రతిష్ట గురించి తాను చాలా విన్నానని, అందుకే స్వయంగా చూసేందుకే ఇక్కడి వచ్చానన్న..నెదర్లాండ్ హెల్త్ మినిస్టర్ జాన్ కైపర్స్..తెలంగాణ రాష్ట్రంలో వైద్య సేవలు ఇంకా ఇక్కడి ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరోగ్య పథకాలు బాగున్నాయని ప్రశంసలు.. By P. Sonika Chandra 17 Aug 2023 in హైదరాబాద్ New Update షేర్ చేయండి NIMS:హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రిని నెదర్లాండ్ వైద్యుల బృందం సందర్శించింది. ఇందులో ఆ దేశ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి జాన్ కైపర్స్ కూడా ఉండడం విశేషం. ఇక నిమ్స్ ఆసుపత్రిలో అందిస్తున్న చికిత్సలను అధ్యయనం చేయడానికి వచ్చిన ఈ బృందం డయాలసిస్, క్యాన్సర్,యూరాలజీ డిపార్ట్ మెంట్లను పరిశీలించింది. ఈ సందర్భంగా నెదర్లాండ్స్ హెల్త్ మినిస్టర్ మాట్లాడుతూ.. తెలంగాణలో నిమ్స్ ఆసుపత్రి ప్రతిష్ట గురించి తాను చాలా విన్నానని, అందుకే స్వయంగా చూసేందుకే ఇక్కడి వచ్చానన్నారు. ఆసుపత్రిలోని వివిధ డిపార్ట్ మెంట్ల పనితీరును స్టడీ చేయడానికి మా బృందం వచ్చిందన్నారు. ఇక తెలంగాణ రాష్ట్రంలో వైద్య సేవలు ఇంకా ఇక్కడి ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరోగ్య పథకాలు బాగున్నాయని నెదర్లాండ్ హెల్త్ మినిస్టర్ జాన్ కైపర్స్ ప్రశంసలు కురిపించారు. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి