బ్రేకింగ్: ఆర్టీసీ బిల్ పై గవర్నర్ కు క్లారిటీ ఇచ్చిన సర్కార్..! టీఎస్ఆర్టీసీ బిల్ కు సంబంధించి గవర్నర్ తమిళి సై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పంపిన లేఖ పై సర్కార్ స్పందించింది. తమిళి సై అడిగిన క్లారిటీకి క్లుప్తంగా.. లిఖిత పూర్వకంగా సమాధానమిచ్చింది. దీంతో గవర్నర్ తమిళి సై సంతృప్తి అవుతారో.. లేదో.. అన్నది ఉత్కంఠగా మారింది.. By P. Sonika Chandra 05 Aug 2023 in హైదరాబాద్ New Update షేర్ చేయండి టీఎస్ఆర్టీసీ బిల్ కు సంబంధించి గవర్నర్ తమిళి సై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పంపిన లేఖ పై సర్కార్ స్పందించింది. తమిళి సై అడిగిన క్లారిటీకి క్లుప్తంగా.. లిఖిత పూర్వకంగా సమాధానమిచ్చింది. అయితే బిల్లును పెండింగ్ లో పెట్టిన గవర్నర్ ఈ కింది 5 అంశాలపై ప్రభుత్వాన్ని వివరణ అడిగారు. 1.1958 నుంచి ఆర్టీసీలో కేంద్ర గ్రాంట్లు, వాటాలు, రుణాలు, ఇతర సహాయం గురించి ఎలాంటి వివరణ లేదు. 2.రాష్ట్ర విభజన చట్టం షెడ్యూల్ ప్రకారం ఆర్టీసీ స్థితిని మార్చడం పై సమగ్ర డీటైల్స్ బిల్లులో లేవు. 3.ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పరిగణిస్తామని చెబుతున్న ప్రభుత్వం.. వారి ప్రయోజనాలు ఎలా కాపాడుతారు.. 4.ఆర్టీసీ కార్మికుల భద్రత పై క్లారిటీ లేదు. వారి భవిష్యత్ ప్రయోజనాలపై మరింత స్పష్టత కావాలి. అయితే ఈ విషయాలపై ప్రభుత్వం ప్రస్తుతానికి క్లుప్తంగా వివరణ రాత పూర్వకంగా గవర్నర్ కు పంపించింది.మరి దీంతో గవర్నర్ సంతృప్తి అవుతారో.. లేదో.. అన్నది ఉత్కంఠగా మారింది. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి