CM Mamata: సీఎం మమతపై పరువునష్టం కేసు.. ఈ నెల 10న విచారణ

సీఎం మమతపై గవర్నర్ ఆనందబోస్ దాఖలు చేసిన పరువునష్టం దావాను ఈ నెల 10న విచారిస్తామని కలకత్తా హైకోర్టు వెల్లడించింది. రాజ్ భవన్‌లో తమకు రక్షణ లేదని, అక్కడికి వెళ్లాలంటే భయంగా ఉందని కొందరు మహిళలు తనకు ఫిర్యాదు చేసినట్లు మమత గతంలో వ్యాఖ్యలు చేశారు.

New Update
CM Mamata: సీఎం మమతపై పరువునష్టం కేసు.. ఈ నెల 10న విచారణ

CM Mamata Banerjee: పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీపై రాష్ట్ర గవర్నర్ సి.వి. ఆనందబోస్ (C. V. Ananda Bose) దాఖలు చేసిన పరువునష్టం దావాను ఈ నెల 10న విచారిస్తామని కలకత్తా హైకోర్టు (Calcutta High Court) వెల్లడించింది. రాజ్ భవన్‌లో తమకు రక్షణ లేదని, అక్కడికి వెళ్లాలంటే భయంగా ఉందని కొందరు మహిళలు తనకు ఫిర్యాదు చేసినట్లు మమత గతంలో వ్యాఖ్యలు చేశారు.

అసలేమైంది..

పశ్చిమ బెంగాల్ సీఎం మమతకు ఆ రాష్ట్ర గవర్నర్ ఆనంద బోస్ షాక్ ఇచ్చారు. ఆమెపై కలకత్తా హైకోర్టులో పరువు నష్టం దావా వేశారు. మహిళలు రాజ్ భవన్ కు వెళ్లేందుకు భయపడుతున్నారని మమత చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయంటూ ఆయన కోర్టును ఆశ్రయించారు. సీఎం మమతతో పాటు తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మరికొందరు నాయకులపై ఆయన పరువు నష్ట దావా వేశారు.

కాగా జూన్ 27న సచివాలయంలో అధికారుల సమావేశంలో మమత మాట్లాడుతూ… కొందరు మహిళలు తనను కలిశారని.. రాజ్ భవన్ కు వెళ్లేందుకు వారికి భయం కలుగుతోందంటూ తనతో చెప్పారని అన్నారు. దీనిపై స్పందించిన గవర్నర్ ప్రజాప్రతినిధులు దురుద్దేశపూరిత వ్యాఖ్యలు చేయకూడదని మమతపై మండిపడ్డారు. గవర్నర్ తనపై అభ్యంతరకరంగా ప్రవర్తించా కంటూ రాజ్ భవన్ కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేస్తున్న మహిళా ఉద్యోగి ఒకరు ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

Also Read: ఐదేళ్ల తరువాత రష్యాకు ప్రధాని మోదీ

Advertisment
Advertisment
తాజా కథనాలు