AP: తెరపైకి APSRTC లీజు వ్యవహారం.. ఆర్టీసీ ఆర్ఎంతో చర్చించిన ఎమ్మెల్యే దామచర్ల జనార్థనరావు.!

వైసీపీ నేత చెవిరెడ్డి మోహిత్ రెడ్డి అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఒంగోలులో ఆర్టీసీ స్థలాన్ని లీజుకు పొందారని స్థానిక ఎమ్మెల్యే దామరచర్ల జనార్దన్ రావు ఆరోపిస్తున్నారు. ఆ లీజును రద్దు చేయాలని ఆర్టీసీ అధికారులను కలిశారు. టీడీపీ, జనసేన నేతలతో కలిసి ఆ స్థలాన్ని ఆయన సందర్శించారు.

New Update
AP: తెరపైకి APSRTC లీజు వ్యవహారం.. ఆర్టీసీ ఆర్ఎంతో చర్చించిన ఎమ్మెల్యే దామచర్ల జనార్థనరావు.!

Ongole: ప్రకాశం జిల్లా ఒంగోలులో APSRTC లీజు వ్యవహారం తెరపైకి వచ్చింది. గత ప్రభుత్వంలో చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి కొడుకు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి CMR INFRA పేరుతో సర్వే నంబర్ 14/1 లోని RTC స్టాలంలోని 40 సెంట్లు 15 సం. లీజుకు తీసుకున్నారు. అయితే, ప్రస్తుత ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్థనరావు లీజు కుదరదంటున్నారు.

Also Read:  శ్రీచైతన్య విద్య సంస్థ తీరుపై SFI ఆందోళన.. సీరియస్ యాక్షన్‌ తీసుకున్న అధికారులు..!

లీజు వ్యవహారంపై ఆర్టీసీ ఆర్ఎంతో చర్చ జరిపారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని అడ్డదిడ్డంగా స్థలాలు లీజుకు తీసుకున్నారని ఆరోపించారు. జరిగిన తంతుపై విచారణ చేపట్టాలని ఎమ్మెల్యే దామచర్ల కోరారు. తెలుగు తమ్ములు, జనసైనికులతో కలసి లీజు తీసుకున్న స్థలాన్ని పరిశీలించారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు