బీసీసీఐ హెడ్ కోచ్ దరఖాస్తు పై స్పందించిన నెహ్రా! గుజరాత్ జట్టు కోచ్ ఆశీష్ నెహ్రా బీసీసీఐ హెడ్ కోచ్ గా దరఖాస్తు చేసుకోకపొవటంపై తాజా గా స్పందించారు.తన పిల్లలు చిన్నవారని, కోచ్ గా ఉంటే కొన్నినెలలు పాటు వారికి దూరంగా ఉండాల్సి వస్తుందని అందుకే దరఖాస్తు చేయలేదని నెహ్రా తెలిపారు.అయినా ఇప్పుడు ఆ పదవి పై ఆసక్తి లేదని పేర్కొన్నారు. By Durga Rao 24 Jul 2024 in Latest News In Telugu స్పోర్ట్స్ New Update షేర్ చేయండి ఇటీవలె BCCI టీమిండియా కొత్త కోచ్ గా గౌతమ్ గంభీర్‌ను నియమించింది. కానీ ద్రవిడ్ వారసుడిగా ఆశిష్ నెహ్రా.. టీమిండియా హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపడుతాడని మొన్నటి వరకు జోరుగా ప్రచారం జరిగింది. ఐపీఎల్ 2022 లో గుజరాత్ టైటాన్స్ ఛాంపియన్‌గా 2023లో రన్నరప్‌గా నిలపడంలో హెడ్ కోచ్‌గా ఆశిష్ నెహ్రా తన పాత్ర వహించాడు.దీంతో నెహ్రా ద్రవిడ్ తర్వాత టీమిండియా హెడ్ కోచ్ గా ఉంటారిని అభిమానులు భావించారు. దీంతో తాజాగా హెడ్ కోచ్ పదవి పై నెహ్రా స్పందించారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో హెడ్ కోచ్ బాధ్యతలను చేపట్టేందుకు తాను సిద్దంగా లేనని నెహ్రా తెలిపాడు.'టీమిండియా హెడ్ కోచ్ పదవి గురించి నేను ఏ రోజు ఆలోచించలేదు. నా పిల్లలు చాలా చిన్నవారు. గౌతమ్ గంభీర్ పిల్లలు కూడా చిన్నవారే. కానీ అతని ఆలోచనలు భిన్నం. ప్రతీ ఒక్కరికి భిన్నమైన ఆలోచనలు ఉంటాయి. అందుకే నా ప్రస్తుత బాధ్యతలతోనే నేను సంతోషంగా ఉన్నాను. కుటుంబానికి దూరంగా 9 నెలల పాటు జట్టుతో ప్రయాణం చేసే మూడ్ నాకు లేదని ఆయన అన్నారు. హార్దిక్ పాండ్యాను కెప్టెన్సీ నుంచి తప్పించడం ఆశ్చర్యం కలిగించలేదు. క్రికెట్‌లో ఇలాంటివి సహజమే. కోత్ కోచ్ వచ్చినప్పుడు వారి ప్రణాళికలు, ఆలోచనలకు తగ్గట్లు జట్టులో మార్పులు చేస్తుంటారు.అయితే ఈ విషయాన్ని గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ హార్దిక్ పాండ్యాకు వివరించారని భావిస్తున్నాని ఆయన అన్నారు. #ashish-nehra మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి