Crime News: కిర్గిస్థాన్ లో భయానక పరిస్థితులు.. లోకల్ వర్సెస్ నాన్ లోకల్.. విద్యార్థులపై దాడి..! కిర్గిస్థాన్లో భయానక పరిస్థితులు కనిపిస్తున్నాయి. భారతీయ విద్యార్థులను టార్గెట్ చేసిన లోకల్స్ వారిపై దాడులకు పాల్పడుతున్నారు. దీంతో బాధిత తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల్ని సురక్షితంగా భారత్‌కు తరలించాలని కిర్గిస్థాన్ ఎంబసీకి ఎంపీ రామ్మోహన్ లేఖ రాశారు. By Jyoshna Sappogula 20 May 2024 in శ్రీకాకుళం క్రైం New Update షేర్ చేయండి Kyrgyzstan: కిర్గిస్థాన్ లో భయానక పరిస్థితులు కనిపిస్తున్నాయి. లోకల్ వర్సెస్ నాన్ లోకల్ అన్నట్లుగా కిర్గిస్థాన్ లో పరిస్థితులు ఉన్నాయి. భారతీయ విద్యార్థులను లోకల్స్ టార్గెట్ చేసినట్లుగా తెలుస్తోంది. దీంతో 15వేల మంది విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. Also Read: ఛీ..నువ్వేం తల్లివి.. మహిళ ప్రాణం తీసిన ట్రోలింగ్..!! తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 2వేల మంది విద్యార్థులు ఉన్నారు. విద్యార్థులు బస చేసిన హోటల్స్ రూమ్‌పై దాడులు చేశారని.. తుపాకులు తీసుకొచ్చి బెదిరింపులకు పాల్పడ్డారని వార్తలు వినిపిస్తున్నాయి. రాడ్లు, కర్రలతో విద్యార్థులపై దాడులకు తెగబడ్డారని పలువురు బాధితులు వాపోతున్నారు. దీంతో విద్యార్థులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతుకుతున్న పరిస్థితి కనిపిస్తోంది. కిర్గిస్థాన్లో భయానక పరిస్థితులపై తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కజికిస్థాన్ ఎంబసీకి శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ లేఖ రాశారు. విద్యార్థుల్ని సురక్షితంగా భారత్‌కు తరలించాలని విజ్ఞప్తి చేశారు. #kazakhstan మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి