నాగర్ కర్నూల్ లో టెన్షన్..కాంగ్రెస్ కార్యకర్తలపై లాఠీ ఛార్జ్.! నాగర్ కర్నూలు జిల్లాలో ఎన్నికల కౌంటింగ్ సెంటర్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఈవీఎం మెషీన్లను తరలిస్తున్నారని ఆందోళన చేపట్టారు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు. బొలెరో వాహనాన్ని అడ్డుకున్నారు. దీంతో, పరిస్థితిని అదుపుచేసేందుకు కార్యకర్తలపై లాఠీ ఛార్జ్ చేశారు పోలీసులు. By Jyoshna Sappogula 03 Dec 2023 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Nagar kurnool: నాగర్ కర్నూలు జిల్లాలో హై టెన్షన్ నెలకొంది. జిల్లా కేంద్రంలోని నెలకొండ మార్కెట్ యార్డ్ లో ఎన్నికల కౌంటింగ్ సెంటర్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఈవీఎం మెషీన్లను తరలిస్తున్నారని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు నిరసన చేపట్టారు. బొలెరో వాహనాన్ని అడ్డుకున్నారు. దీంతో, ఆందోళన చేపట్టిన వారిపై పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. ఘటనపై సమాచారం అందుకున్న కాంగ్రెస్ MLC దామోదర్ రెడ్డి వెంటనే స్పాట్ కు వచ్చారు. ఈవీఎంలు భద్రపరిచిన గదిని పరిశీలించారు. అయితే, ఖాళీ బాక్స్ లు మాత్రమే భద్రపరుస్తున్నామని అంటున్నారు జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్. Also Read: తెలంగాణ బాద్‍షా ఎవరు..? కౌంటింగ్ లైవ్ అప్డేట్స్! కాగా, తెలంగాణ వ్యాప్తంగా 49 కౌంటింగ్ కేంద్రాల్లో భారీ భద్రత చోటు చేసుకుంది. 119 నియోజకవర్గాల కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత, సీసీ కెమెరాలతో పర్యవేక్షణ నిర్వహించనున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చెల్ జిల్లాలో 29 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. కౌంటింగ్ కేంద్రాల వద్ద పోలీసుల ఆంక్షలు, 144 సెక్షన్ అమలు చేశారు. కౌంటింగ్ సందర్భంగా రోడ్లపై ర్యాలీలు, టపాసులు కాల్చడం, ఊరేగింపులపై నిషేధం విధించడం జరిగింది. స్ట్రాంగ్ రూముల వద్ద 40 కేంద్ర కంపెనీల బలగాలతో భద్రత పెంపొందించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2,290 మంది అభ్యర్ధుల భవితవ్యం తేలనుంది. మొత్తం 1766 టేబుల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. #telangana-election-2023 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి