Narasaropeta: నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలుపై రాళ్లదాడి

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల పోలింగ్ ఘట్టంలో చాలా ప్రాంతాల్లో ఘర్షణలు జరుగుతున్నాయి. నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలుపై వైసీపీ వర్గీయులు రాళ్లదాడి చేశారు. అక్కడ మూడు కార్లను ధ్వంసం చేశారు. అక్కడ రీపోలింగ్ కోరతామని అంటున్న శ్రీకృష్ణదేవరాయలు 

New Update
Narasaropeta: నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలుపై రాళ్లదాడి

Narasaropeta: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల పోలింగ్ కు ప్రజలు ఎంత ఆసక్తిగా తరలివస్తున్నారో.. అదేవిధంగా చాలా ప్రాంతాల్లో పార్టీల మధ్య ఘర్షణలు కూడా చోటు చేసుకుంటున్నాయి. పలు ప్రాంతాల్లో వైసీపీ కార్యకర్తలు ఇతర పార్టీల నేతలు.. కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలుపై వైసీపీ వర్గీయులు దాడి చేశారు. ఎంపీ దొండపాడులోని పోలింగ్ కేంద్రం పరిశీలనకు వెళ్లారు. ఆ సమయంలో అక్కడి వైసీపీ వర్గీయులు ఆయనను అడ్డుకున్నారు. అయితే, ఆయనను అడ్డుకోవద్దని.. అక్కడకు వచ్చే హక్కు ఉందనీ ట్రైనీ కలెక్టర్ కల్పశ్రీ చెప్పారు. కానీ, వైసీపీ వర్గీయులు వినిపించుకోకుండా.. వాదనలకు దిగారు. దీంతో పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. 

Narasaropeta: ఆ తరువాత వైసీపీ వర్గీయులు ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు కాన్వాయ్ పై రాళ్లదాడి తెగబడ్డారు. అక్కడ ఉన్న మూడు కార్లను ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. దొండపాడు సమస్యాత్మక ప్రాంతం అని తాను ముందే చెప్పినట్లు తెలిపారు. అక్కడ వైసీపీ శ్రేణులు విధ్వంసం చేస్తున్నారన్నారు. అక్కడి పోలింగ్ బూత్ లో టీడీపీ ఏజెంట్లను వైసీపీ ఏజెంట్లు బయటకు నెట్టేశారని చెప్పారు. అక్కడ ఉన్న పోలీసులు దీనిని ఏమాత్రం పట్టించుకోలేదన్నారు. నరసరావుపేటలో వైసీపీ కార్యకర్తలు అరాచకం సృష్టిస్తున్నారనీ, నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రాల వద్దకు వెళ్లకుండా అడ్డుకుంటున్నారని ఎంపీ చెప్పారు. వైసీపీ శ్రేణుల ఆగడాలకు పోలీసులు పూర్తి మద్దతు ఇస్తున్నారని ఆయన ఆరోపించారు. 

దొండపాడు పోలింగ్ కేంద్రంలో రీపోలింగ్ జరపాలని ఎన్నికల సంఘాన్ని కోరుతామని శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు. 

Advertisment
Advertisment
తాజా కథనాలు