తెలంగాణ గజగజ.. సింగిల్ డిజిట్‎కు పడిపోతున్న ఉష్ణోగ్రతలు

కొన్ని రోజులుగా తెలంగాణాలో రికార్డు స్థాయిలో సాధారణం కన్నా అతితక్కువ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సాయంత్రం 4 గంటల నుంచే చలి మొదలై ఉదయం 10 గంటల వరకు తీవ్రత కొనసాగుతుండటంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

New Update
తెలంగాణ గజగజ.. సింగిల్ డిజిట్‎కు పడిపోతున్న ఉష్ణోగ్రతలు

Winter effect: కొన్ని రోజులుగా తెలంగాణాలో రికార్డు స్థాయిలో సాధారణం కన్నా అతితక్కువ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సాయంత్రం 4 గంటల నుంచే చలి మొదలై ఉదయం 10 గంటల వరకు తీవ్రత కొనసాగుతుండటంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్ని చోట్ల ఉష్ణోగ్రత 5 నుంచి 12 డిగ్రీల వరకూ పడిపోయే పరిస్థితి ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేశారు. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్, ఖమ్మం, వరంగల్, కరీంనగర్ లాంటి చాలా జిల్లాల్లో చలి తీవ్రత ఎక్కువగా ఉంది.

ఇది కూడా చదవండి: అమ్మ ప్రేమంటే ఇదే.. మృత్యువుకు ఎదురెళ్లి మరీ..ఏం చేసిందో చూడండి!

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలి రోజురోజుకూ పెరుగుతుంది. జనాలు బయటకు రావడానికి కూడా భయపడుతున్నారు. దానికి తోడు చలి గాలులూ దడ పుట్టిస్తున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్‌లోని ఏజెన్సీ ప్రాంతంలోమూడు రోజులుగా ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. తూర్పు, ఈశాన్య దిశల నుంచి వీస్తున్న గాలుల కారణంగానే చలి తీవ్రత గత మూడు రోజులుగా పెరిగిందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలం గిన్నెధరిలో ఉష్ణోగ్రత 9 డిగ్రీలకు పడిపోయింది. అదే జిల్లా సిర్పూర్ లో కనిష్ట ఉష్ణోగ్రత 9.4 డిగ్రీల సెల్సియస్ గా నమోదు అయ్యింది.


సోనాలలో 9.1, అర్లి లో 9.4, మంచిర్యాల జన్నారం లో 9.8 జిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయ్యింది. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు చలి తీవ్రతను తట్టుకోలేకపోతున్నారు. ఉద్యోగులకు, విద్యార్థులకు చలి కారణంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇది పంట పొలాలపై కూడా తీవ్ర ప్రభావం చూపుతోంది. ప్రజలు ఇల్లుదాటి బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. మరికొన్ని రోజులు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశముందని సమాచారం.

Advertisment
Advertisment
తాజా కథనాలు