IPS Riti Raj : బండి భగీరథ్‌ కేసుపై సిట్.. ఎవరీ డీసీపీ రితిరాజ్...ఈమె ట్రాక్ రికార్డు తెలుసా?

బీజేపీ ఎంపీ, కేంద్ర సహయ  మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌పై ఫోక్సో చట్టం కింద కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.

New Update
ips

బీజేపీ ఎంపీ, కేంద్ర సహయ  మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌పై ఫోక్సో చట్టం కింద కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. అయితే ఈ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు పోలీసులు ఈ కేసును చాలా సీరియస్ గా తీసుకున్నారు. తాజాగా ఈ కేసుపై సైబరాబాద్ పోలీస్ కమిషనర్ రమేష్ రెడ్డి కీలక అప్ డేట్ ఇచ్చారు. ఈ వ్యవహారంలో చట్టప్రకారం కఠినంగా వ్యవహరిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.

ఈ కేసు దర్యాప్తును అత్యంత వేగంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు సీపీ తెలిపారు. కూకట్‌పల్లి డీసీపీ రితిరాజ్ నేతృత్వంలో ఈ విచారణ జరుగుతుందని ఆయన వెల్లడించారు. మహిళా అధికారి పర్యవేక్షణలో విచారణ జరగడం వల్ల కేసులోని సున్నితమైన అంశాలను మరింత లోతుగా పరిశీలించే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. బాధితురాలి ఫిర్యాదు,  ప్రాథమిక ఆధారాల మేరకు బండి భగీరథ్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు సీపీ తెలిపారు.  ఈ కేసు విషయంలో తమపై ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేవు. ఒకవేళ ఉన్నా సరే.. మేము వేటికీ తలొగ్గం. చట్టం తన పని తాను చేసుకుపోతుందని సీపీ స్పష్టం చేశారు. విచారణలో ఎక్కడా పక్షపాతం ఉండదని, బాధితులకు న్యాయం జరిగేలా పారదర్శకంగా దర్యాప్తు చేపడుతున్నామని పోలీసు బాస్ హామీ ఇచ్చారు.

 కూకట్‌పల్లి డీసీపీ రితిరాజ్ ఎవరంటే.. 

రితిరాజ్ స్వస్థలం బీహార్. ఆమె పాట్నాలో పెరిగారు.  ఢిల్లీలోని నేషనల్ లా యూనివర్సిటీ నుంచి లా పట్టా పొందారు. 2018 బ్యాచ్‌కు చెందిన అధికారిణి. తెలంగాణ కేడర్‌కు కేటాయించబడిన ఆమె, హైదరాబాద్‌లోని నేషనల్ పోలీస్ అకాడమీలో కఠిన శిక్షణ పూర్తి చేసుకున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా ఎస్పీగా పనిచేశారు. అక్కడ ఎన్నికల సమయంలో శాంతిభద్రతలను కాపాడటంలో, పోలీసు సంక్షేమ కార్యక్రమాల్లో ఆమె కీలక పాత్ర పోషించారు. 

ACBలో కూడా బాధ్యతలు నిర్వహించి, అవినీతిపై ఉక్కుపాదం మోపారు. 2025 సెప్టెంబర్ 29న మాదాపూర్ జోన్ డీసీపీగా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం ఆమె కూకట్‌పల్లి డీసీపీగా కొనసాగుతున్నారు.  రాజకీయ సెన్సిటివిటీ ఉన్న కేసులను సైతం ఎవరికీ తలొగ్గకుండా, కేవలం చట్టం ప్రకారం విచారించే అధికారిగా ఆమెకు పేరుంది. ఒకవైపు ఐపీఎస్ శిక్షణ, మరోవైపు లా గ్రాడ్యుయేట్ కావడంతో.. పోక్సో (POCSO) లాంటి కఠినమైన చట్టాలను అమలు చేయడంలో ఆమె ఎంతో సమర్థవంతంగా వ్యవహరిస్తారని ఈ కేసును ఆమెకు అప్పగించారు.

Advertisment
తాజా కథనాలు