ఘోర అగ్ని ప్రమాదం.. మంటల్లో షాపింగ్ మాల్! జనగామ జిల్లా విజయ షాపింగ్ మాల్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. షార్ట్ సర్క్యూట్ తో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. భారీగా మంటలు ఎగసిపడడంతో షాపింగ్ మాల్ పూర్తిగా దగ్దమైంది. చుట్టుపక్క 5 షాపుల వరకు మంటలు అంటుకున్నాయి. ఈ ప్రమాదం ఈరోజు ఉదయం జరిగింది. By Archana 27 Oct 2024 in వరంగల్ Latest News In Telugu New Update Jangaon District షేర్ చేయండి Jangaon District: వరంగల్ జనగామ జిల్లాలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ రోజు ఉదయం 6 గంటల ప్రాంతంలో విజయ షాపింగ్ మాల్ లోషార్ట్ సర్క్యూట్ కావడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు భారీగా భారీగా ఎగసిపడడంతో షాపింగ్ మాల్ పూర్తిగా కాలిపోయింది. అలాగే చుట్టుపక్కల ఉన్న 5, 6 షాపులకు కూడా మంటలు అంటుకున్నాయి. పండగ వేళ ఇలాంటి ఘటన జరగడంతో అక్కడి ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఇటీవలే కార్ల వర్క్ షాపులో అగ్ని ప్రమాదం.. ఇది ఇలా ఉంటే ఇటీవలే.. హర్యానాలోని గురుగ్రామ్ లోని ఓ కార్ల వర్క్ షాపులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. షాపులో పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో 16 లగ్జరీ కార్లు దగ్థమయ్యాయి. అగ్ని ప్రమాదం గురించి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపుచేశారు. ఈ ప్రమాదంలో దాదాపు రూ.7 కోట్లు విలువైన కార్లు అగ్నికి ఆహుతి అయ్యాయని సమాచారం.మోతీ విహార్ ప్రాంతంలోని బెర్లిన్ మోటార్ వర్క్‌షాప్‌లో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. Also Read: నాగ్ మామ హోస్టింగ్ మామూలుగా లేదు.. కంటెస్టెంట్స్ కుండ పగిలింది! ఆ సమయంలో సిబ్బంది ఎవరూ లేకపోవడంతో పెద్ద ప్రాణ నష్టం తప్పింది. అయితే.. పదహారు లగ్జరీ కార్లు వర్క్‌షాప్‌లో పార్క్ చేశారని.. ఇవన్నీ కాలి బూడిదయ్యాయని అగ్నిమాపక అధికారులు తెలిపారు. వీటితోపాటు కొన్ని పాత వాహనాలు కూడా దగ్ధమైనట్లు అధికారులు చెప్పారు. సమాచారమందుకున్న వెంటనే ఘటనాస్థలికి వెళ్లి మంటలను ఆర్పేశామని పేర్కొన్నారు. మెర్సిడెస్, ఆడి క్యూ 5, బీఎమ్‌డబ్ల్యూ, రేంజ్ రోవర్, వోల్వో, ఫోర్డ్ ఎకో స్పోర్ట్, ఒపెల్ ఎస్ట్రా, జాగ్వార్‌తో పాటు పదహారు అత్యాధునిక కార్లు వర్క్‌షాప్‌లో పార్క్ చేసి ఉంచారు. ఈ ప్రమాదంలో ఇవన్నీ బూడిదగా మారాయి. అగ్నిప్రమాదంలో కొన్ని స్క్రాప్డ్ వాహనాలు కూడా బూడిదైనట్లు అధికారి తెలిపారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మూడు గంటలపాటు శ్రమించి మంటలను ఆర్పినట్లు తెలిపారు. అగ్నిప్రమాదానికి కారణం ఇంకా తెలియలేదు. Also Read: అలా చేస్తే వచ్చే పాపులారిటీ అక్కర్లేదు.. వైరలవుతున్న సాయి పల్లవి కామెంట్స్ మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి