హైడ్రా, నామినేటెడ్ పదవులపై టీపీసీసీ చీఫ్ కీలక ప్రకటన

TG: హైడ్రాను అన్ని జిల్లాలకు విస్తరిస్తామని అన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. ప్రభుత్వ స్థలాలు అక్రమిస్తే ఎంతటి వారైనా వదిలిపెట్టమని హెచ్చరించారు. త్వరలోనే నామినేటెడ్ పోస్టుల భర్తీ, మంత్రివర్గ విస్తరణ ఉంటుందని చెప్పారు.

New Update
MAHESH GOUD TPCC

Mahesh Goud: తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారిన హైడ్రా పై కీలక వ్యాఖ్యలు చేశారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఈరోజు మీడియా చిట్ చాట్ లో ఆయన మాట్లాడుతూ.. హైడ్రా ఆపితే హైదారాబాద్ మరో వయనాడ్ అవుతుందని అన్నారు. త్వరలో హైడ్రా జిల్లాలకు విస్తరిస్తాం అని చెప్పారు. ప్రభుత్వ స్థలాలు అక్రమిస్తే ఎంతటి వారైనా వదిలిపెట్టం అని హెచ్చరించారు. తమ కుటుంబసభ్యులు కబ్జా చేసిన కూల్చేయండి అంటూ అధికారులను కోరారు.

కేటీఆర్ నిజంగా చదువుకున్నాడా?

కాంగ్రెస్ రుణ మాఫీ చేస్తే రాజీనామా చేస్తా అన్న హరీష్ రావు మాట తప్పారని మండిపడ్డారు. సవాలు విసిరి వెనక్కి తగ్గారని సెటైర్లు వేశారు. తాము మూసి నది ప్రక్షాళన నిధులను దారి మళ్లిస్తున్నామని బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావు చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. మూసి సుందరీకరణ పై ఇంకా DPR సిద్ధం కాలేదని.. నిధులు ఎలా మల్లిస్తాం అని ప్రశ్నించారు. 

అమెరికాలో కేటిఆర్ చదివాడా, లేదా సర్టిఫికెట్ కొన్నాడా? అని చురకలు అంటించారు. కేటీఆర్ పై కోపం తో మంత్రి కొండా సురేఖ మాట్లాడారని అన్నారు. పీసీసీ సూచన తో చేసిన వ్యాఖ్యలను ఆమె వెనక్కి తీసుకున్నారని చెప్పారు. త్వరలో నామినేటెడ్, పార్టీ పదవుల భర్తీ ఉంటుందని కీలక అప్డేట్ ఇచ్చారు. రాష్ట్ర మంత్రి వర్గంలో నిజామాబాద్ కు త్వరలో చోటు దక్కుతుందని అన్నారు.

 

Advertisment
Advertisment
తాజా కథనాలు