TG High Court: ముందు ఏపీకి వెళ్లండి.. ఐఏఎస్ లకు హైకోర్టులో షాక్! DOPT ఉత్తర్వులను సవాల్ చేస్తూ జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలితో పాటు మరో నలుగురు IAS అధికారులు దాఖలు చేసిన పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో ఈ రోజు విచారణ జరిగింది. ముందు ఏపీకి వెళ్లి రిపోర్ట్ చేయాలని న్యాయస్థానం అధికారులను ఆదేశించింది. తీర్పును రిజర్వ్ చేసింది. By Nikhil 16 Oct 2024 in తెలంగాణ రాజకీయాలు New Update షేర్ చేయండి ఏపీకి వెళ్లాలన్న క్యాట్ ఆదేశాలను సవాల్ చేస్తూ తెలంగాణలో పని చేస్తున్న ఐదుగురు ఐఏఎస్ ఆఫీసర్లు దాఖలు చేసిన లంచ్‌మోషన్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా హైకోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది. తాము జోక్యం చేసుకుంటే ఈ అంశానికి అంతు ఉండదని తెలిపింది. ముందు వెళ్లి ఏపీలో రిపోర్టు చేయాలని ఆదేశించింది. ప్రజా సేవ కోసం ఎక్కడ అవకాశం ఇస్తే అక్కడకు వెళ్లి పని చేయాల్సిందే అని స్పష్టం చేసింది. పిటిషన్ ను డిస్మిస్ చేస్తే మళ్లీ అప్పీల్ చేస్తారని వ్యాఖ్యనించింది. అయితే తాము ఇప్పటికిప్పుడు రిలీవ్ చేయలేమన్న తెలంగాణ ప్రభుత్వం న్యాయస్థానానికి తెలిపింది. రిలీవ్ చేయడానికి 10-15 రోజులు సమయం ఇవ్వాలని కోరింది. ఇందుకు సంబంధించిన తీర్పును హైకోర్టు రిజర్వులో ఉంచింది. ఇది కూడా చదవండి: Hydra: హైడ్రాకు హైకోర్టు బిగ్ రిలీఫ్ ఐఏఎస్ ఆఫీసర్లకు క్యాట్ షాక్ ఇచ్చింది. డీఓపీటీ జారీ చేసిన ఉత్తర్వులు రద్దుచేయాలంటూ ఐదుగురు ఐఏఎస్‌లు వేసిన పిటిషన్ ను క్యాట్ తోసిపుచ్చింది. డీవోపీటీ ఆదేశాలు పాటించాల్సిందేనంటూ తీర్పు వెల్లడించింది. అంతేకాదు రేపు యథావిధిగా ఎక్కడివాళ్లు అక్కడే రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఏపీలో వరదలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, వారికి సేవ చేయాలని లేదా? అంటూ చివాట్లు పెట్టింది. ఇది కూడా చదవండి: స్కిల్ యూనివర్సిటీ ప్రవేశాలకు దరఖాస్తులు.. లాస్ట్ డేట్ ఇదే! అది గైడ్‌లైన్స్‌లో ఉందా.. అలాగే స్థానికత ఉన్నప్పటికీ స్వాపింగ్ చేసుకోవచ్చని గైడ్‌లైన్స్‌లో ఉందా అంటూ ఐఏఎస్ లను ప్రశ్నించింది. ఐఏఎస్‌ల కేటాయింపుపై డీఓపీటీకి నిర్ణయం తీసుకునే అధికారం ఉందని స్పష్టం చేసింది. వన్ మెన్ కమిటీ సిఫారసులను డీఓపీటీ ఎలా అమలు చేస్తుందని, వన్ మెన్ కమిటీ సిఫారసు చేసినప్పుడు ఎందుకు హైకోర్టుకు వెళ్లలేదని క్యాట్ అడిగింది. ఇది కూడా చదవండి: నేడు ఢిల్లీకి సీఎం రేవంత్... రేపు కీలక ప్రకటన! Konda Surekha: కొండా సురేఖపై రాహుల్ గాంధీ సీరియస్..కేబినెట్ నుంచి ఔట్! #amrapali #high-court-telangana మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి