తెలంగాణలో 6లక్షల రేషన్ కార్డులు రద్దు! TG: సంక్షేమ పథకాలకు ఆధారం కావడంతో కొత్త రేషన్‌కార్డుల కోసం రాష్ట్రంలో లక్షల కుటుంబాలు ఎదురుచూస్తున్నాయి. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కొత్తగా 6,47,479 కార్డులు జారీ అయ్యాయి. అదే సమయంలో వివిధ కారణాలతో 5,98,000 కార్డులను రద్దుచేశారు. By V.J Reddy 29 Oct 2024 in తెలంగాణ హైదరాబాద్ New Update షేర్ చేయండి Ration Cards: తెలంగాణలో రేషన్ కార్డు కోసం ఎదురుచూపులు చూస్తున్న వారి సంఖ్య నానాటికి పెరుగుతూ వస్తోంది. ప్రభుత్వం ఇచ్చే పథకాలకు అర్హులు కావడానికి రేషన్ కార్డు తప్పనిసరి కావడంతో దీనికి కోసం ఎదురుచూస్తున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. కాగా ఈ సంఖ్య ఇంతలా పెరిగిపోవడానికి గల కారణాల్లో ముఖ్యమైంది.. కొత్త రేషన్ కార్డులను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేయకపోవడం. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ నుంచి విభజన అయ్యి నూతన రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడిన సమయంలో నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం కొత్తగా 6,47,479 కార్డులు జారీ చేసింది. కాగా అదే సమయంలో వివిధ కారణాలతో 5,98,000 కార్డులను రద్దు చేసింది. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా 89,98,546 రేషన్ (ఆహారభద్రత) కార్డులు ఉన్నట్లు అధికారిక వర్గాలు చెబుతున్నాయి. ఇది కూడా చదవండి: నేడు సొంత జిల్లాలో జగన్ పర్యటన 19.92 లక్షల దరఖాస్తులు... ఇది కూడా చదవండి: బాంబ్ బెదిరింపులు.. 62 విమానాలు రద్దు! గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తొలుత 6.5 లక్షల నూతన రేషన్ కార్డులను మంజూరు చేసి.. అదే సమయంలో దాదాపు 6 లక్షల రేషన్ కార్డులను రద్దు చేసింది. అయితే గత పదేళ్లుగా అర్హులకు కొత్త రేషన్ కార్డులను మంజూరు చేయలేదు. దీంతో అనేక మంది రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న పథకాలకు దూరమయ్యారు. తెలంగాణ జనాభా దాదాపు 4 కోట్లకు పైనే ఉంటోంది. అందులో ప్రస్తుతం.. ఉన్న రేషన్‌కార్డుల ద్వారా 2.81 కోట్ల మంది లబ్ధి పొందుతున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. 2010-11 లెక్కల ప్రకారం.. రాష్ట్ర జనాభాలో 71.47 శాతం మంది ఆహారభద్రత పరిధిలో ఉన్నారు. ఇది కూడా చదవండి: సీఎం రేవంత్‌కు ముప్పు.. సెక్యూరిటీ మార్పు! ఇదిలా ఉంటే తెలంగాణలో కొలువుదీరిన కాంగ్రెస్ సర్కార్.. కొత్త రేషన్ కార్డులు అందించేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే రేషన్‌కార్డుల జారీకి మంత్రివర్గ ఉపసంఘాన్ని కూడా ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి అందరికి ఉచిత వైద్య సేవలు అందాలనే ఆలోచనతో డిజిటల్ ఫ్యామిలి హెల్త్ కార్డులను ప్రవేశ పెట్టారు. ఈ కార్డుల జారీ అయ్యాకే కొత్త రేషన్ కార్డులపై ఫోకస్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఉన్న కార్డుల్లో కుటుంబ సభ్యుల పేర్లను చేర్చడం.. ఆ తర్వాత కొత్త రేషన్‌కార్డుల జారీ ప్రక్రియ చేపట్టనున్నట్లు సమాచారం. కొత్త రేషన్‌కార్డుల కోసం ఇటీవల ‘ప్రజాపాలన’ కార్యక్రమం కింద దరఖాస్తులను స్వీకరించింది. ఇందులో కొత్త రేషన్‌కార్డులు, ధరణి సమస్యల పరిష్కారం.. రెండింటికీ కలిపి దాదాపు 19.92 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు అధికారిక వర్గాలు చెప్పాయి. ఇది కూడా చదవండి: ఉచిత సిలిండర్ పథకం.. నేటి నుంచి బుకింగ్స్ స్టార్ట్ మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి