/rtv/media/media_files/34LTFv5TLXSUxWWgqK7i.jpg)
తెలంగాణలో స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను పెంచుతూ రేవంత్ సర్కార్ తీసుకువచ్చిన జీవోను సవాల్ చేస్తూ బుట్టెంగారి మాధవరెడ్డి హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ విచారించేందుకు చీఫ్ జస్టిస్ బెంచ్ ఏర్పాటు చేశారు. జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి, జస్టిస్ అభినందన్ కుమార్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ పిటిషన్ పై విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫున సీనియర్ లాయర్లు ప్రభాకర్, మయూర్ రెడ్డి వాదనలు వినిపించారు. ప్రభుత్వం తరఫున ఏజీ సుదర్శన్ రెడ్డి వర్చువల్ గా వాదనలు వినిపించారు. బీసీల రిజర్వేషన్లను 42 శాతానికి పెంచడం పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని పిటిషనర్ తరఫు లాయర్ ప్రభాకర్ వాదనల్లో పేర్కొన్నారు. 50 శాతానికి మించి రిజర్వేషన్లను పెంచొద్దని చెబుతున్న తరుణంలో.. ఒక్క బీసీలకే 42 శాతం రిజర్వేషన్లు ఎలా ఇస్తారన్నారు. బీసీ రిజర్వేషన్లపై గవర్నర్ దగ్గర బిల్లు పెండింగ్ లో ఉన్న సమయంలో జీవో తీసుకురావాడం కరెక్ట్ కాదని కోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది.
బీసీ రిజర్వేషన్లపై విచారణలో తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
— DD News Telangana | తెలంగాణ న్యూస్ (@ddyadagirinews) September 27, 2025
👉🏻 అవసరమైతే స్థానిక ఎన్నికలు వాయిదా వేయండి
👉🏻 గవర్నర్ వద్ద బిల్లు పెండింగ్లో ఉండగా జిఓ ఇవ్వడం సరికాదు
👉🏻 కోర్టుల జోక్యం ఉండకూడదంటే, 10 రోజులు ఎన్నికలు వాయిదా వేసుకోవాలన్న హైకోర్టు#LocalElections#Reservationpic.twitter.com/W4Fc1ccyLo
అవసరం అయితే స్థానిక ఎన్నికలను వాయిదా వేయాలని కోర్టు వ్యాఖ్యానించింది. నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తారని ఈసీ తరఫు లాయర్ ను ఈసందర్భంగా కోర్టు అడిగింది. ఏ క్షణమైనా తాము నోటిఫికేషన్ ఇచ్చేందుకు సిద్ధమని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ లాయర్ కోర్టుకు తెలిపారు. అయితే.. నోటిఫికేషన్ వచ్చినా కూడా తాము ఈ పిటిషన్ పై విచారణ చేస్తామని న్యాయస్థానం స్పష్టం చేసింది. ప్రభుత్వ అభిప్రాయం చెప్పాలని కోరగా.. సోమవారం చెబుతానని ఏజీ కోర్టుకు తెలిపారు. దీంతో తదుపరి విచారణను అక్టోబర్ 8కి వాయిదా వేసింది న్యాయస్థానం. వాస్తవానికి రోజు సాయంత్రం ఎన్నికల షెడ్యూల్ ఇవ్వాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ భావించింది.
సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, జెడ్పీ చైర్మన్ రిజర్వేషన్లను కూడా ఈ మేరకు ఖరారు చేసింది. హైకోర్టు తాజా వ్యాఖ్యలతో ఎన్నికల కమిషన్ ఇప్పుడు నోటిఫికేషన్ విడుదల చేస్తాందా? లేదా? అన్న అంశంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అయితే.. ఏ క్షణమైనా నోటిఫికేషన్ ఇచ్చేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ సిద్ధం అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. రిజర్వేషన్లు ఖరారు కావడంతో నామినేషన్ కు సిద్ధం అవుతున్న ఆశావహులు కోర్టు తాజా వ్యాఖ్యలతో డైలమాలో పడ్డారు. ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందా? వచ్చినా కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? ఈ రిజర్వేషన్లతోనే ఎన్నికలు జరుగుతాయా? అన్న టెన్షన్ వారిలో వ్యక్తం అవుతోంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా కులగణన చేపట్టిన ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ 42 శాతం బీసీ రిజర్వేషన్లతోనే స్థానిక ఎన్నికలకు వెళ్లాలని భావిస్తోంది.
Follow Us